📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Elvish Yadav: బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపిన దుండగులు

Author Icon By Sharanya
Updated: August 17, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) నివాసం వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని గురుగ్రామ్‌ (Gurugram, Haryana)లో ఆయన ఇంటిపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Elvish Yadav:

ఉదయం బైక్‌పై దుండగుల దాడి

ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో ముగ్గురు దుండగులు (Three attackers)బైక్‌పై అక్కడికి చేరుకుని ఎల్విష్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. వారు దాదాపు 25 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపిన తర్వాత పరారయ్యారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఘటన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేరు

కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ (27) (Elvish Yadav) హర్యానా వెలుపల పనిమీద ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్‌టేకర్ మాత్రం భవనంలోనే ఉన్నారు. ఈ ఇంటి రెండో, మూడో అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటుందని అధికారులు తెలిపారు.

పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలన

సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాంతాన్ని ముట్టడించారు. సెక్టార్-56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది.

సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు

దుండగులను గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయలేదని సమాచారం. దుండగులు కాల్పులకు ఎందుకు పాల్పడ్డారనే అంశంపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/raja-raghavamsi-a-fraudster-in-police-uniform-went-to-raja-raghavamsis-house-what-happened-next/national/531421/

Bigg Boss OTT Winner Breaking News Elvish Yadav Gurugram Firing Haryana crime latest news police investigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.