📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

వివాదంలో హిందీ సినీ నిర్మాత.

Author Icon By Anusha
Updated: February 16, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, టీవీ పరిశ్రమలో ఘనత సాధించిన ఏక్తా కపూర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. భారత సైనికులను అవమానించారనే ఆరోపణలతో ఆమెపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. ఈ కేసును ముంబై కోర్టు పరిశీలించి మే 9లోగా నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.హిందుస్తానీ భావు అని పిలువబడే యూట్యూబర్ వికాస్ పాఠక్ ఫిర్యాదును దాఖలు చేశారు. ఏక్తా కపూర్ OTT ప్లాట్‌ఫారమ్ ఆల్ట్ బాలాజీ, ఆమె తల్లిదండ్రులు శోభ మరియు జీతేంద్ర కపూర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ సహకారంతో ఆమె పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ‘ఆల్ట్ బాలాజీలో’ అనే వెబ్ సిరీస్ దాని ఎపిసోడ్‌లలో ఒకదానిలో “అక్రమ లైంగిక చర్య”లో ఓ సైనికుడు పాల్గొన్నట్లు తప్పుగా చూపించారు. దానిపై దేశంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సైనికులను తప్పుగా చూపించారు. దేశ గౌరవాన్ని కించపరిచేలా ఉందని వెబ్ సిరీస్ పై వ్యతిరేఖత మొదలైంది. దాంతో తాజాగా కీర్టు ఆమె ను అదుపులోకి తీసుకోవాలని ముంబై కోర్టు నగర పోలీసులను ఆదేశించింది.యూట్యూబర్ పాఠక్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.యూట్యూబ్ లో ఆయన వీడియోలకు క్రేజ్ ఎక్కువే,అలాగే వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో అనేక గేమ్ షోలలో పాల్గొన్న ఈయన తన యాటిట్యూడ్ తో క్రేజ్ ను అందుకున్నాడు. ఇక బుల్లితెర టాప్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 2019 సీజన్‌లో పాఠక్ పాల్గొన్నాడు. మే 2021 లో, కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి, విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శివాజీ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేసినందుకు ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఏక్త కపూర్ పై కేసు నమోదు అవ్వడం తో బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నిర్మాత ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.బాలీవుడ్ లో గతంలో ఇలాంటి కేసులు ఎన్నో నమోదు అయ్యాయి. కానీ కొన్ని కేసులు వివరణతో వివాదాలకు చెక్ పెట్టారు. ఈమె ఎలాంటి వివరణ ఇస్తుందో..? లేదా వెబ్ సిరీస్ ను రిమూవ్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది.

న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదులో,ఆల్ట్ బాలాజీలో ప్రసారమైన వెబ్ సిరీస్‌లో ఒక సైనిక అధికారి అభ్యంతరకరమైన చర్యకు పాల్పడుతున్నట్లు చూపించారని ఆరోపించారు. ‘భారత సైన్యం సైనిక యూనిఫాంలో జాతీయ చిహ్నంతో అభ్యంతరకరమైన చర్యలను ప్రదర్శించడం ద్వారా, నిందితులు మన దేశ ఖ్యాతిని, గౌరవాన్ని దెబ్బతీశారు.’ అని ఫిర్యాదులో పేర్కొంది. ఏక్తా కపూర్ వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటి సారి కాదు ఆమె నిర్మించిన సినిమాలు, వెబ్ సిరీస్ పై ఇప్పటికే అనేకసార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏక్తా కపూర్ నటించిన ‘రాగిణి ఎంఎంఎస్ 2’ సినిమాలోని ఒక సన్నివేశం వివాదం రేపింది. ఆ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో నిషేధించారు. ఏక్తా కపూర్ ఏదో ఒక కారణంతో నిత్యం వివాదాల్లో నిలుస్తుంది.

కోర్టు ఆదేశాలు

బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఈ ఫిర్యాదును స్వీకరించి, పోలీసులు మే 9లోగా విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ద్వారా ఈ ఫిర్యాదు దాఖలైంది.

#ALTBalaji #BollywoodNews #CourtCase #EktaKapoor #HindustaniBhau #indianarmy #MumbaiNews #OTTControversy Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.