మలయాళం ఇండస్ట్రీ లో చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు, వందల కోట్లను వసూలు చేశాయి. ఈ ఏడాది కూడా అదే రికార్డును కొనసాగిస్తూ వెళ్లింది. అలాంటి రికార్డులను సాధించిన సినిమాల జాబితాలో ‘ఎకో’ (Eko Movie) ఒకటిగా కనిపిస్తుంది. సందీప్ వినీత్ .. నరేన్ .. బినూ పప్పు .. సౌరభ్ సచ్ దేవా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు.కేవలం 5 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 50 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం.
Read also: Sister Midnight: ‘సిస్టర్ మిడ్ నైట్’ (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
విమర్శకుల ప్రశంసలు అందుకుంది
ఈ ఏడాది చివరిలో మలయాళ విజయపరంపరను కొనసాగించిన సినిమా ఇది. నవంబర్ 21న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా (Eko Movie)మలయాళంతో పాటు తెలుగు,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొంతమంది ఆగంతకులు, ఒక నిందితుడి కోసం గాలిస్తూ అడవిలోని ఓ కొండపైకి చేరుకుంటారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ అడవిలోని రహస్యాలేమిటి? అనేది కథ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: