Eid Mubarak: అభిమానులకు ఈద్ విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు

Read Time:  1 min
Eid Mubarak: అభిమానులకు ఈద్ విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు
FONT SIZE
GET APP

Eid Mubarak: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర తారలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు.

Read Also : Mattancherry Mafia Movie: మెగాస్టార్ మమ్ముట్టి ‘మట్టాంచేరి మాఫియా’ అనౌన్స్‌మెంట్

Eid Mubarak: అభిమానులకు ఈద్ విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు
Eid Mubarak: Film celebrities extend Eid wishes to fans

సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు

విలక్షణ నటుడు కమల్ హాసన్ తన ఈద్ సందేశంలో పండుగ పరమార్థాన్ని వివరించారు. “ఇస్లామిక్ సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడం వంటి దయాగుణమే నిజమైన సేవ అని ఈ పండుగ మనకు నేర్పుతుంది” అని ఆయన పేర్కొన్నారు. తోటివారి పట్ల కరుణ కలిగి ఉండటమే ఈ పండుగలోని అసలైన స్ఫూర్తి అని ఆయన గుర్తు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ అందమైన పండుగ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐక్యతను నింపాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ ఈద్ ముబారక్ మీకు, మీ ప్రియమైన వారికి ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలి అని ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం మీకు ప్రేమ, ఐక్యత, మీ ప్రియమైన వారితో అందమైన క్షణాలు దక్కాలి అని తన సందేశాన్ని పంచుకున్నారు. వీరితో పాటు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, కార్తి వంటి ఇతర స్టార్లు కూడా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.