📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Eesha Movie: ఈషా మూవీ రివ్యూ

Author Icon By Aanusha
Updated: December 25, 2025 • 9:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్రిగున్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంత్, బబ్లూ పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఈషా’ (Eesha Movie). హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరుస హిట్స్ కొడుతున్న బన్నీవాస్‌, వంశీ నందిపాటి ‘ఈషా’ సినిమా (Eesha Movie)ను డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ చేసారు.మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Read Also: Dhurandhar box office : పుష్ప-2 రికార్డులు బద్దలు.. ‘ధురంధర్’ సెన్సేషన్!

కథ

కళ్యాణ్ (త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), వినయ్ (అఖిల్ రాజ్), అపర్ణ (సిరి హనుమంతు) నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అందులో వినయ్, అపర్ణ పెళ్లి చేసుకుంటారు. నయనను కళ్యాణ్ ప్రేమిస్తుంటాడు. నలుగురు తమ ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో దొంగ బాబాలు, మూఢనమ్మకాల పేర్లతో మోసం చేస్తున్న వాళ్ల అసలు గుట్టు బయటపెడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అమెరికాలో మానసిక వైద్యుడిగా ఉండి, భార్య మరణం తర్వాత ఉన్నట్టుండి బాబా అవతారం ఎత్తిన ఆది దేవ్ (పృథ్వీ రాజ్) గురించి తెలుస్తుంది. అతడిని ఎక్స్ప్రెస్ చేయాలని నలుగురు వెళుతున్న టైం లో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత పుణ్యవతి (మైమ్ మధు) ఆ నలుగురిని వెంబడిస్తుంది. అప్పుడు ఏం జరిగింది.. వాళ్లకు పుణ్యవతికి ఏంటి సంబంధం అనేది అసలు కథ..

Eesha Movie Review

విశ్లేషణ..

ఫస్ట్ హాఫ్ వీళ్ళు ఆది దేవ్ వద్దకు బయలుదేరే వరకు సింపుల్ గానే సాగిపోతుంది. మధ్యలో ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఓ ఫ్రెండ్షిప్ పాటతో సాగదీశారు. ఈ నలుగురు యాక్సిడెంట్ చేయడం, పుణ్యవతి ఆత్మ రావడం, వీళ్ళు ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్లడం అంతా కాస్త భయం భయంగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఒక్కసారిగా భయపెట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ ఇంట్లో ఏం జరిగింది అని సాగదీస్తూనే ఈ నలుగురు ఆది దేవ్ తో గొడవ పడుతూ బయట తిరుగుతూ కాస్త సాగదీసాడు అనిపిస్తుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి బాగానే భయపెట్టారు. చివర్లో ఉన్న ట్విస్ట్ బాగున్నా రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళు ఆ ట్విస్ట్ ని ముందే కనిపెట్టేస్తారు. చావులు, ఆత్మలు గురించి చెప్తూ హారర్ సినిమాగా ఈషాను తెరకెక్కించారు. సినిమా అంతా భయపెట్టకపోయినా కొన్ని సీన్స్ లో బాగానే భయపెట్టారు. కొన్ని సీన్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేస్తూ భయపెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Eesha Movie Review latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.