Durandhar 2 piracy: భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఎప్పటి నుంచో వేధిస్తున్న పైరసీ సమస్య తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటున్న దురంధర్ 2 చిత్రాన్ని కూడా చుట్టుముట్టింది. మార్చి 19న ఎంతో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పైరసీ బారిన పడటం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
Read Also: Chuck Norris Death News: లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!

పాకిస్తాన్‌లో లీక్: వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్
ఈ అక్రమ లీకేజీ వ్యవహారం అనూహ్యంగా పాకిస్తాన్‌లో వెలుగుచూసింది. లాహోర్‌కు చెందిన జర్నలిస్ట్ ఖలీద్ మహమ్మద్ తన ఇంట్లోనే ఈ సినిమాకు సంబంధించిన పైరేటెడ్ వెర్షన్‌ను వీక్షిస్తున్నట్లు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు కాస్తా వైరల్ కావడంతో, సినిమా విడుదలై ఒక్క రోజు కూడా గడవకముందే సరిహద్దులు దాటి పైరసీ కావడంపై చిత్ర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పరిశ్రమపై పైరసీ ప్రభావం
భారీ బడ్జెట్‌తో, ఎంతో మంది కష్టంతో రూపొందే సినిమాలను ఇలా అక్రమంగా లీక్ చేయడం వల్ల ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ‘దురంధర్ 2’ వంటి భారీ చిత్రాలకు సైతం ఇలాంటి అనుభవం ఎదురవ్వడం పైరసీ భూతం ఎంతలా విస్తరించిందో తెలియజేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :