మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఇటీవలే తన కొత్త తెలుగు సినిమా గురించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వర్కింగ్ టైటిల్ “DQ41” పేరుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన దుల్కర్ సల్మాన్ ఈసారి కొత్త లుక్, కొత్త కథతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ (SLV Cinemas) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్, నూతన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్ గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. కథ, సెట్‌అప్, క్యారెక్టర్ డిజైన్ విషయంలో దుల్కర్ ఎప్పటిలాగే ప్రత్యేకతను చూపిస్తున్నాడని పరిశ్రమ వర్గాల టాక్.
హీరోయిన్‌గా పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే
ఇకపోతే, ఈ సినిమాలో హీరోయిన్‌గా పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) నటించనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డే గతంలో స్టార్ హీరోలతో పనిచేసి భారీ విజయాలు సాధించిన అనుభవం ఉన్నది. ఇప్పుడు దుల్కర్‌తో జోడీ కడుతుండటం ఇద్దరికీ కొత్త ఫ్రెష్‌నెస్ ఇస్తుందనే అభిప్రాయం క్రియేట్ అయ్యింది.
అయితే,బాహుబలి స్టార్ రమ్యకృష్ణ (Ramya Krishna) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. బాహుబలి ప్రాంచైజీలో శివగామి లాంటి పవర్ ఫుల్ రోల్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది రమ్యకృష్ణ.
ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్నది మాత్రం సస్పెన్స్
ఇంతకీ రమ్యకృష్ణ ఈ ప్రాజెక్టులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీతో రవి నేలకుడిటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.ప్రస్తుతం DQ41 షూటింగ్ దశలో ఉంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ ఇటీవలే విడుదలైన లోక చాఫ్టర్ 1 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ బ్యానర్‌లో ప్రస్తుతం నాని నటిస్తోన్న ది ప్యారడైస్ కూడా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: