📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dowry Harassment: నటుడు ధర్మా మహేశ్ పై కట్నం వేధింపుల కేసు నమోదు

Author Icon By Sharanya
Updated: August 19, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్త్రీలు అంటే ఏ రంగంలోనైనా ఆమెను ఒక విలాసవస్తువుగా భావించే అనాగరిక భావజాలం నుంచి మనం ఇంకా బయటకు రాలేదనిపిస్తుంది. మహిళలు అంతరిక్షంలో వెళ్తున్నా, యుద్ధంలో పాల్గొని పోరాడుతున్నా, విమానాలను నడుపుతున్నా తన కెరీర్ జీవితంలో ఎంత ఎదిగినా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వరకట్నం దాహానికి బలికావాల్సిందేనా! ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? సెలబ్రిటీలు అయినా, సామాన్యులైనా కాస్త డబ్బు, పేరు వస్తే ఇక వారిని అదుపు చేయడం కష్టమే. నీతిగా బతకాల్సింది పోయి, దారితప్పి అన్యాయంగా జీవించేవారిని
చట్టానికే అప్పగించాలి. సరిగ్గా ఇదే చేసింది హీరో ధర్మ మహేష్ (Hero Dharma Mahesh) భార్య గౌతమి. సినిమాల్లో హీరో కానీ, రియల్ లైఫ్ లో మాత్రం కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు.

Dowry Harassment

స్టేటస్ పెరిగేసరికి విలన్గా మారిన కట్నం ధర్మా మహేశ్

ధర్మా మహేశ్ ‘సిందూరం’, ‘డ్రింక్ సాయి’ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. అదనపు కట్నం కోసం వేధింపులకు (Dowry Harassment) గురిచేస్తున్నారంటూ మవాశ్, అతని కుటుంబ సభ్యులపై భార్య గౌతమి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపులకు (Dowry Harassment) సంబంధించి గతంలో ధర్మ మహేశ్కు పోలీసులు కౌన్సిలింగ్ (Police counseling) కూడా ఇచ్చారు. ధర్మా మహేశ్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి (31)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారగా 2019లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమితో పాటు ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కాగా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మా మహేశ్, యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేయసాగాడు. దీంతో విసుగు చెందిన భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇతనిపై పలు సెక్షన్లను నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ధర్మా మహేశ్ పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/breaking-news-nandamuri-family-tragedy-padmaja-passes-away/andhra-pradesh/532408/

Breaking News crime against women Dharma Mahesh Dowry Harassment latest news Police case Telugu News tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.