📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rukmini Vasant: రుక్మిణి వసంత్ కుటుంబ నేప‌థ్యం తెలుసా?

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘సప్త సాగరాలు దాటి’ అనే చిత్రంతో రుక్మిణి (Rukmini Vasant) తెరపై తన ప్రతిభను చాటుకుంది. ఆ సినిమాలో ఆమె చూపించిన సున్నితమైన భావ వ్యక్తీకరణ, లోతైన పాత్ర పోషణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.

Samantha: సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది

ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) లో యువరాణి పాత్రలో కనిపించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన రాయల లుక్స్, క్లాసీ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ఆమె ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. సినిమాలో ప్రతి సన్నివేశంలో ఆమెకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను థ్రిల్‌కు గురిచేస్తోంది.

తాజాగా ఆమె ఫేమ్ పెరిగిపోవ‌డంతో నెటిజన్లు “రుక్మిణి వసంత్ ఎవరు?” అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ (Colonel Vasant Venugopal) గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు.

ఉగ్రవాదుల దాడిని ధైర్యంగా ఎదుర్కొంటూ వీర మరణం

జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పఠాన్‌కోట్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో సేవలు అందించారు. 2007లో ఉరి సెక్టార్ వద్ద ఉగ్రవాదుల దాడి (Terrorist attack) ని ధైర్యంగా ఎదుర్కొంటూ వీర మరణం పొందారు.ఈ యుద్ధంలో ఆయన ఛాతిలో ఏకంగా ఏడు బుల్లెట్లు తగిలినట్లు సమాచారం. దేశం కోసం ప్రాణం అర్పించిన కల్నల్ వసంత్‌కు భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక గౌరవం ‘అశోక చక్ర‌ను ప్రదానం చేసింది.

Rukmini Vasant

కేవలం ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రుక్మిణి వసంత్, తండ్రి జ్ఞాపకాలను ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం తండ్రి జయంతి, వర్ధంతి రోజున ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియా (Social media) లో భావోద్వేగపూరిత పోస్టులు చేస్తూ ఉంటారు.రుక్మిణి తల్లి సుభాషిణి, ప్రసిద్ధ భరతనాట్యం నర్తకి.

ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న‌ రుక్మిణి

భర్త మరణం తర్వాత ‘వీర్ రత్న ఫౌండేషన్’ (‘Veer Ratna Foundation’) అనే సంస్థను స్థాపించి, తనలాంటి సైనిక భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు. అంటే, రుక్మిణి తల్లిదండ్రులు ఇద్దరూ దేశం కోసం తమ జీవితాలను అంకితం చేశారు.

ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న‌ రుక్మిణి వసంత్, కేవలం అందంతోనే కాకుండా తన నటనతోనూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంతో పాటు, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Colonel Vasanth Venu Gopal Kantara Chapter 1 latest news Rukmini Vasanth Rukmini Vasanth biography Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.