VIROSH: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అభిమానులు తమకు ప్రేమతో పెట్టిన ‘విరోష్’ (VIROSH) అనే పేరునే తమ వివాహ వేడుకకు ఖరారు చేశారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పుర్‌లోని ఒక విలాసవంతమైన ప్యాలెస్‌లో ఫిబ్రవరి 26న వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే ఈ జంట వివాహ వేడుకల కోసం ఉదయ్‌పుర్ చేరుకున్నారు. మరి ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్‌గా పేరొందిన ఈ కపుల్ ఆస్తుల నికర విలువ ఓసారి చూస్తే..
Read Also: Thalapathy Vijay: ‘జననాయగన్’ విడుదలకు తప్పని అడ్డంకులు
విజయ్ దేవరకొండ నెట్ వర్త్
ఆయన ఒక్కో సినిమాకు సుమారు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో రూ.15 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఆయన సొంతం.కార్లంటే ప్రత్యేక ఇష్టమున్న విజయ్ వద్ద BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో XC90, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతేకాదు, ఆయనకు సొంతంగా ఒక చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఉంది. నివేదికల ప్రకారం.. విజయ్ దేవరకొండ నికర ఆస్తుల విలువ రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
రష్మిక నెట్ వర్త్
రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. ఆమె కన్నడ సినిమా కిరిక్ పార్టీతో నటిగా అరంగేట్రం చేసింది. కర్ణాటకలోని కొడగు జిల్లా నుంచి వచ్చిన ఈ భామ.. తక్కువ కాలంలోనే కన్నడ నుంచి తెలుగు, తమిళం, ఆపై బాలీవుడ్ వరకు తన ప్రతిభను చాటింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదిస్తోంది.
ఫోర్బ్స్ ప్రకారం, రష్మిక నెట్ వర్త్ రూ.66 కోట్లు. బెంగుళూరులో రూ.8 కోట్ల విలువైన లగ్జరీ హౌస్‌తో పాటు హైదరాబాద్, ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌ల్లో కూడా ఆస్తులు కలిగి ఉంది. FE నివేదిక ప్రకారం ఆమె ఒక చిత్రానికి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ లాగా ఈమె వద్ద కూడా ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడిస్ బెంజ్ సి క్లాస్ లగ్జరీ కార్లను కలిగి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: