📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: YVS Chowdhury: డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ రంగానికి వినూత్నమైన సినిమాలు అందించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి (YVS Chowdhury) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి గారు గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి 8.31 గంటలకు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సులో ఆమె తుదిశ్వాస విడవడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ మిత్రులు దుఃఖంలో మునిగిపోయారు.

OG movie: OG సినిమా టికెట్ రేట్ల పెంపుపై కోమటిరెడ్డి ఆగ్రహం?

తల్లిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ నోట్ ఇన్‌స్టా (Insta) లో పోస్ట్ చేశారు.మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు.

కానీ ఒక లారీడ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు సినిమాలు చూపించడం నుండి దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండి వంటలు,

తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్‌ని

నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్ ఇత్యాది అవసరాలకు ఎటువంటి లోటు రాకుండా తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు. వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి.

View this post on Instagram

A post shared by Yvs Chowdarry (@i_am_yvs)

అనే తపనతో అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు.

ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు

అటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని॥లకు.. ఈ భువి నుండి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు’ అంటూ వైవీఎస్ సుదీర్ఘ నోట్ విడుదల చేశారు. దీంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు వైవీఎస్ చౌదరికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

గుడివాడ (Gudivada) కు చెందిన వైవీఎస్ చౌదరి అసలు పేరు యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి. సినిమా ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జు నిర్మాణంలో తెరకెక్కిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన నాగార్జున, హరికృష్ణ కలయికలో ‘సీతారామరాజు’, మహేశ్‌బాబుతో ‘యువరాజు’ చిత్రాలు నిర్మించారు. 

బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ మారారు

ఆ తర్వాత ‘బొమ్మరిల్లు వారి’ అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ మారారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్.. చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2012లో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘నిప్పు’ చిత్రాన్ని గుణశేఖర్ దర్శకత్వంలో వైవీఎస్ చౌదరి నిర్మించారు.

తాజాగా ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడైన నందమూరి తారక రామారావును పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తాజాగా ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News emotional note film director film producer Instagram post latest news mother passes away ratnakumari demise Telugu cinema Telugu News yvs chowdary

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.