📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

వినాయక్ ఆరోగ్యాంగా ఉన్నారు పుకార్లు నమ్మకండి

Author Icon By Anusha
Updated: March 3, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజు ఉదయం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు పుట్టుకొచ్చాయి. ఆయ‌న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని పలు మాధ్య‌మాల్లో ఈ వార్త‌లు ప్ర‌చారం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ వార్తలు వేగంగా వైరల్ కావడంతో, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

టీమ్ క్లారిటీ

ఈ వార్తలపై వీవీ వినాయక్ టీమ్ అధికారికంగా స్పందించింది. అయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంటూ, కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

చట్టపరమైన చర్యలు

వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రామాణిక సమాచారం తెలుసుకొని ప్రచురించాలని టీమ్ విజ్ఞప్తి చేసింది. ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు కొనసాగితే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.వీవీ వినాయక్ ఆరోగ్యంపై వచ్చిన నకిలీ వార్తల కారణంగా ఆయన అభిమానులు భయాందోళనకు గురయ్యారు. కానీ, ఆయన ఆరోగ్యంపై క్లారిటీ రావడంతో, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరిగింది.అప్పటి నుంచి ఆయన పూర్తి  విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.రీసెంట్ గా  వి.వి. వినాయక్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు వంటి కొందరు సినిమా సెలబ్రెటీలు ఆయన  ఇంటికి  వెళ్లి ఆయనను పరామర్శించారు.  అయితే అసలు నిజం వేరుగా ఉంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం చెప్తూ ఆయన టీమ్ ఓ  నోట్ ని  కూడా విడుద‌ల చేసింది. 

అందులో ఇలా ఉంది,ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ గారు ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును. ఎన్టీఆర్ నటించిన ‘ఆది’చిత్రంతో వీవీ వినాయక్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఏర్పడింది.ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్నీ, అదుర్స్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించిన వీవీ వినాయక్ కూడా స్టార్ స్టేటస్ లోనే కొనసాగుతున్నారు.అయితే, కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు.

చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు.  ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సీనయ్య సినిమా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అది నిలిచిపోయిందని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు.  

#FakeNewsAlert #TeluguCinema #Tollywood #TrendingNews #VVVinayak #VVVinayakFans #VVVinayakHealth Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.