సోషల్ మీడియా యుగంలో, అభిమానుల మధ్య జరిగే వాదోపవాదాలు, కామెంట్లు, మీమ్స్, చాలాసార్లు ఘర్షణల వరకూ వెళ్లడం ఇప్పుడు సాధారణమే అయింది. తమిళ సినీ పరిశ్రమలో అయితే ఈ ఫ్యాన్ వార్‌లకు అజిత్ కుమార్, విజయ్ (Ajith-Vijay) అభిమానులే సింబల్‌గా మారారు.వీరి సినిమాలు రిలీజ్ అయిన రోజున థియేటర్ల దగ్గర జరిగే హడావుడి, ఆనందం ఒక పండగ అయితే, అభిమానుల మధ్య జరిగే ఈ పోటీ, తగాదాలు హాట్‌టాపిక్‌గా మారుతుంటాయి.
Read Also: Ravi Kishan: మరోసారి బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు
అసలు ఈ ఇద్దరి మధ్య నిజంగా శత్రుత్వం ఉందా? లేక అభిమానులు సృష్టించుకున్న ఊహాగానాలా?.. దీనిపైనే అజిత్ ((Ajith) తాజాగా క్లారిటీ ఇస్తూ అభిమానులపై ఫైర్ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ విజయ్‌తో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టంగా చెప్పారు. “కొంతమంది కావాలని మా ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టిస్తున్నారు.
అవి తప్పుడు వార్తలు. వాటిని నమ్మి అభిమానులు ఒకరినొకరు దూషించుకోవడం అనవసరం. విజయ్ (Ajith-Vijay) నాకు సోదరుడిలాంటి వాడు. అతనికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాను. అభిమానులు గొడవలు కాదు, సంతోషంగా జీవితం గడపడం నేర్చుకోవాలి” అని సూచించారు.
కొన్ని మీడియా వర్గాల్లో వస్తోన్న వార్తలను అజిత్ ఖండించారు
విజయ్ (Vijay) రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొన్ని మీడియా వర్గాల్లో వస్తోన్న వార్తలను అజిత్ ఖండించారు. ఎవ్వరూ తమ మధ్య విషం కలిపిన పాలు పోసే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు.కోలీవుడ్‌లో విజయ్, అజిత్ ఎప్పుడూ స్నేహంగా ఉంటారు.
విజయ్ కూడా గతంలో యాదృచ్ఛికంగా ఒక అభిమాని తెచ్చిన అజిత్–విజయ్ ఫోటోపై సిగ్నేచర్ పెట్టడం ద్వారా వారి స్నేహాన్ని మరోసారి చూపించాడు. ఆ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇటీవల అజిత్‌కు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు, విజయ్ శుభాకాంక్షలు చెప్పలేదని వచ్చిన వార్తలపై అజిత్ మేనేజర్ స్పందించారు. “ఆ వార్తలు తప్పు. అవార్డు ప్రకటన వచ్చిన వెంటనే విజయ్ శుభాకాంక్షలు పంపాడు. వాళ్లిద్దరూ ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: