📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dhurandhar2: ‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Dhurandhar2: ‘Aari Aari’ song from ‘Dhurandhar-2’ released

Dhurandhar2: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈసారి ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పాన్-ఇండియన్ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా కేవలం వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలను ఆకాశానికి చేర్చిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఆరి ఆరి..’ (Aari Aari) అంటూ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Read Also: The Bluff: ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ ఈ క్లాసిక్ హిట్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బీట్స్‌తో రీమిక్స్ చేశారు. రణ్‌వీర్ సింగ్ తనదైన ఎనర్జీ, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటకు ప్రాణం పోశాడు. ఇప్పటికే 310 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన ట్రైలర్ తర్వాత, ఈ పాట విడుదలతో సినిమా ప్రమోషన్లు మరో స్థాయికి చేరాయి. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా ఈ నెల‌ 19న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aari Aari song release Latest News in Telugu Ranveer Singh Aditya Dhar Movie Ranveer Singh spy thriller release date Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.