ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సినిమా (Dhurandhar Movie) దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి మంచి టాక్‌తో పాటు భారీ వసూళ్లు సాధిస్తోంది.. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఘన విజయం సాధించింది.
Read Also: Peddi Movie Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ మార్చి 27కే విడుదల
జనవరి చివరి వారం ఓటీటీలో అందుబాటులోకి
ఈ సినిమా (Dhurandhar Movie) కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రూ.700 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని, అది మార్చి 19న విడుదల కానుందని ప్రకటించారు. ‘ధురంధర్’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) రూ.285 కోట్లకు సొంతం చేసుకుంది.
తెలుగు డబ్బింగ్ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ‘ధురంధర్’ మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. అయితే, మూవీ రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి చివరి వారం ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: