రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ (Dhurandhar Movie) కలెక్షన్లలో దూసుకుపోతుంది. మూడో శనివారం ‘ధురంధర్’ (Dhurandhar Movie) మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కలెక్షన్ల విషయంలో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా సాధించని స్థాయిలో వసూళ్లు నమోదు చేసి ఇండస్ట్రీ రికార్డ్స్‌ను తిరగరాసింది. ఈ రికార్డు ప్రాధాన్యత ఏమిటంటే, దాదాపు 8 సంవత్సరాలుగా ఎవరూ టచ్ చేయలేకపోయిన ‘బాహుబలి 2’ రికార్డును ‘ధురంధర్’ బ్రేక్ చేయడం విశేషం. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో 16వ రోజు అత్యధికంగా గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి 2’ ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగింది.
Read Also: Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యునరేషన్
‘బాహుబలి 2’ పేరిట ఉన్న రికార్డును బద్దలు
ఆ సినిమా 16వ రోజు ఇండియా వైడ్‌గా సుమారు రూ.36 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి, ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా అధిగమించలేకపోయింది. అయితే ఇప్పుడు ‘ధురంధర్’ ఆ చరిత్రను మార్చేసింది. 16వ రోజు ఏకంగా రూ.39 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ‘బాహుబలి 2’ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. దీంతో ‘ధురంధర్’ ఇండస్ట్రీ హిస్టరీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూలు చేసినట్లు INDIA TODAY తెలిపింది. ఇవాళ రూ.800 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేవలం ఇండియాలోనే ఈ మూవీ రూ.555.5 కోట్ల నెట్ సాధించినట్లు వెల్లడించి. దీంతో యానిమల్ లైఫ్ టైమ్ కలెక్షన్ల(రూ.553 కోట్లు)ను దాటేసిందని పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: