Dhurandhar 2 Movie Review: బాలీవుడ్ నుంచి చాన్నాళ్ల తర్వాత ఒక పక్కా పాన్ ఇండియా మాస్ మసాలా సినిమాగా ‘ధురంధర్’ వచ్చి బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్: ది రెవెంజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌తోనే భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం.
Read Also: Ellamma Movie: ఐదు నిమిషాల్లోనే కనెక్ట్ అయ్యా: DSP
యాక్షన్ అండ్ వయోలెన్స్: ట్రైలర్ ప్రామిస్ నెరవేరిందా?
‘ధురంధర్ 2’ కేవలం కథకే పరిమితం కాకుండా, మొదటి పార్ట్‌ను మించిన హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, గ్రిప్పింగ్ కథనం, భారీ స్థాయిలో రక్తపాతంతో కూడిన సీన్లతో నిండిపోయింది. దర్శకుడు ఆదిత్య ధార్ టేకింగ్, రణవీర్ సింగ్ ఎనర్జీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తున్నాయి.
కథ
‘ధురంధర్ ది రివెంజ్’ స్టోరీని మొత్తం ఆరు ఛాప్టర్లుగా డివైడ్ చేశాడు డైరెక్టర్ ఆదిత్య ధార్. మొదటి పార్ట్‌లో అసలు పాకిస్థాన్‌కి వెళ్లిన భారత ఏజెంట్ హమ్జా (రణ్‌వీర్ సింగ్) అసలు కథేంటి? హమ్జాగా పేరు మార్చక ముందు జస్కిరాత్ సింగ్ రాంగి జీవితంలో ఏం జరిగింది? ఏ పరిస్థితుల్లో అతను జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలు చూపిస్తూ ధురంధర్ 2ని మొదలుపెట్టాడు. హై యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్లతో సినిమాని స్టార్ట్ చేసి.. తర్వాత చూడబోయే రక్తపాతం మరెంత దారుణంగా ఉంటుందో ఫస్ట్ ఛాప్టర్‌తోనే హింట్ ఇచ్చాడు డైరెక్టర్.

ఆ తర్వాత జస్కిరాత్‌ని హమ్జాగా పేరు మార్చి పాకిస్థాన్‌కి పంపడం.. అక్కడ రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత హమ్జా రాజకీయాల్లో ఎలా ఎదిగాడు. ఏకంగా పాకిస్థాన్‌లో ఒక ప్రభుత్వాన్ని మార్చగలిగే స్థాయికి ఎలా చేరుకున్నాడు. ఓవైపు ల్యారీ నుంచి మొదలుపెట్టి కరాచీ వరకూ ఎలా తన కనుసన్నల్లోకి తెచ్చుకున్నాడనేది ధురంధర్ 2లో అసలు కథ. ఇక బడే సాహెబ్ అంటూ మొదటి పార్టులో ఫుల్ హైప్ ఇచ్చిన వ్యక్తిని హమ్జా కలవడంతో కథలో అసలు మజా వస్తుంది. ఇక ఆ తర్వాత పాకిస్థాన్‌లో హమ్జా వేట ఎలా మొదలైంది..? హమ్జా భారత ఏజెంట్ అని ఎవరైనా తెలుసుకున్నారా? మొత్తానికి ధురంధర్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది మిగిలిన కథ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: