Dhurandhar 2 advance booking : రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలు అడ్వాన్స్ బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభంజనం కారణంగా ముంబైలోని ఐకానిక్ మరాఠా మందిర్ థియేటర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ ‘డీడీఎల్‌జే’ షో టైమ్‌ను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. మూడు దశాబ్దాలుగా ఉదయం 11:30కి ప్రదర్శితమవుతున్న ఈ సినిమా షోను ఇప్పుడు ఉదయం 10 గంటలకు మార్చడం విశేషం.
Read Also: Ambati Rayudu: ఐపీఎల్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అంబటి రాయుడు
రికార్డులపై కన్నేసిన ‘ధురంధర్ 2’
దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా కోసం థియేటర్లు ప్రత్యేక షెడ్యూల్స్ రూపొందిస్తున్నాయి. మరాఠా మందిర్‌లో మధ్యాహ్నం 1:15, సాయంత్రం 5:30, రాత్రి 9:45 గంటలకు షోలు ప్లాన్ చేయగా, దేశవ్యాప్తంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా ప్రత్యేక ప్రదర్శనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన ఈ చిత్రం, షారుఖ్ ఖాన్ ‘జవాన్’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రికార్డులను సవాల్ చేస్తోంది. విడుదలకు ముందే ఇంతటి హైప్ రావడంతో ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: