Dhurandhar 2 Collections: ధురంధర్-2 ప్రీమియర్స్‌తోనే రూ.75 కోట్లు

Read Time:  1 min
Dhurandhar 2 Collections: ధురంధర్-2 ప్రీమియర్స్‌తోనే రూ.75 కోట్లు
FONT SIZE
GET APP

Dhurandhar 2 Collections: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధురంధర్-2’ భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, కేవలం ప్రీమియర్ షోల ద్వారానే కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

Read Also:Ustaad Bhagat Singh Movie Review: పవన్ మాస్ జాతర.. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

ప్రీమియర్స్‌తోనే ₹75 కోట్ల వసూళ్లు:

ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్-2’ నిలిచింది. కేవలం ప్రీమియర్ షోల తోనే ఈ సినిమా ₹75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇందులో కేవలం భారత్‌లోనే ₹52.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం.

Dhurandhar 2 Collections: Dhurandhar-2 earns Rs. 75 crores from its premieres alone
Dhurandhar 2 Collections: Dhurandhar-2 earns Rs. 75 crores from its premieres alone

ఓవర్సీస్‌లోనూ రికార్డుల వేట:

విదేశాల్లోనూ రణ్‌వీర్ సింగ్ క్రేజ్ మామూలుగా లేదు. ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్స్‌తోనే $2.5 మిలియన్ల వసూళ్లను సాధించి, హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో గతంలో ఉన్న పలు భారీ చిత్రాల రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేసింది.

‘OG’, ‘యానిమల్’ రికార్డులు కనుమరుగు:

‘ధురంధర్-2’ దెబ్బకు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ మూవీస్ రికార్డులు బ్రేక్ అయ్యాయి.

  • ప్రీమియర్ వసూళ్లలో పవన్ కళ్యాణ్ ‘OG’ (₹25 కోట్లు) రికార్డును వెనక్కి నెట్టింది.
  • ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో రణబీర్ కపూర్ ‘యానిమల్’ ($1.2 మిలియన్లు) సాధించిన రికార్డును కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.