Dhurandhar 2 Collections: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
Read Also: Sundeep Kishan New Movie: ‘శంబాల’ మేకర్స్‌తో సందీప్ కిషన్ క్రేజీ ప్రాజెక్ట్

ట్రేడ్ అనలిస్ట్ సంస్థ సాక్నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలో సుమారు రూ. 339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్లో కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ దాదాపు రూ. 96 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అంతర్జాతీయ స్థాయిలో రణవీర్ సింగ్ క్రేజ్‌ను చాటిచెప్పింది.
Dhurandhar 2 Collections: శనివారం ఒక్కరోజే రూ. 113 కోట్ల వసూళ్లు
ముఖ్యంగా శనివారం (మార్చి 21) నాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో గర్జించింది. ఒక్క రోజే ఏకంగా రూ. 113 కోట్ల వసూళ్లను సాధించి స్పై థ్రిల్లర్ జోనర్లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. రణవీర్ సింగ్ నటన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వారాంతం కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: