📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest news: Dharmendra: ఫిలింఫేర్ అవార్డుకు నోచుకోని ధర్మేంద్ర

Author Icon By Saritha
Updated: November 24, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించిన మెగా స్టార్ ధర్మేంద్ర, ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించినప్పటికీ, ఫిలింఫేర్(Filmfare) ఉత్తమ నటుడి(Dharmendra) విభాగంలో ఒక్కసారి కూడా అవార్డు దక్కకపోవడం తనను ఎప్పటికప్పడు బాధపెట్టేదని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లో కూడా ప్రస్తావించారు. ధర్మేంద్రకు ఎటువంటి ఫార్మల్ యాక్టింగ్ ట్రైనింగ్ లేకపోయినా, సహజమైన హావభావాలు, ఆత్మవిశ్వాసం, మాస్‌ అప్పీల్‌తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నారు. సత్యకామం, సీతా ఔర్ గీతా, చూప్కే చూప్కే వంటి చిత్రాల్లో ఆయన నటన ఎంతో మంది సినీప్రియులను మెప్పించింది. అయితే, ఎంత మంచి నటన ప్రదర్శించినప్పటికీ ఆయనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ గుర్తింపు దక్కలేదు.

Read also: ఏలూరు జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

Dharmendra misses out on Filmfare award

ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారంతో భావోద్వేగం

1997లో ఫిలింఫేర్(Dharmendra) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నప్పుడు ధర్మేంద్ర కళ్లలో ఆనందభాష్పాలు మెదిలాయి. ఆ పురస్కారం తన సినీప్రయాణానికి వచ్చిన గొప్ప గౌరవమని, అయితే ఉత్తమ నటుడి అవార్డు మాత్రం దక్కి ఉంటే మరింత ఆనందంగా ఉండేదని అప్పట్లోనే తెలిపారు. సినీ పరిశ్రమలో తనకున్న ప్రేమ, అభిమానిని గుర్తు చేస్తూ ఆ రోజు ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ అభిమానులను మళ్లీ మళ్లీ చూడేలా చేస్తోంది. సినిమాలతో పాటు రెస్టారెంట్ బిజినెస్‌లో కూడా ధర్మేంద్ర విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. గరం ధరం దాబా’, ‘హీ-మ్యాన్ రెస్టారెంట్స్వంటి ఫుడ్ బ్రాండ్లకు ఆయన భాగస్వామిగా ఉన్నారు. పంజాబీ వంటకాల సువాసనతో ఈ రెస్టారెంట్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఫ్యాన్స్ ఆయన పేరు వినగానే అక్కడి వంటకాలను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున వెళ్లడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.

ధర్మేంద్ర వంటి విస్తృతమైన సినీ ప్రయాణం కలిగిన నటుడికి ఉత్తమ నటుడు అవార్డు దక్కకపోవడం ఇప్పటికీ అభిమానుల మధ్య చర్చనీయాంశంగానే ఉంది. ఆయన కొన్ని పాత్రలు అప్పటి కాలానికి మించి ఉన్నాయని, అవార్డులు పొందాల్సిన నటన ఆయన అనేక చిత్రాల్లో చేశారని అభిమానులు పేర్కొంటున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bollywood Bollywood News Dharmendra Filmfare Awards Hindi Cinema Indian Actors Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.