📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Dhanush- Mrunal: ధ‌నుష్‌తో మృణాల్ చెట్ట పట్టాలు

Author Icon By Ramya
Updated: August 5, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధనుష్, మృణాల్ ఠాకూర్‌ల బంధంపై వస్తున్న పుకార్లు

Dhanush- Mrunal: కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంపై మీడియా దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఆయన సినిమా కుబేర విజయం తర్వాత, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇడ్లీ కడై సినిమా పోస్ట్-ప్రొడక్షన్ (Post-production) పనులతో బిజీగా ఉన్నారు. ఈయన గురించి నిత్యం ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడిపోయిన తర్వాత, నటి మీనాతో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వాటిని మీనా ఖండించారు. ఇప్పుడు ఆయన పేరు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్తో ముడిపెడుతూ వార్తలు వస్తున్నాయి.

ప్రేమ పుకార్లకు కారణాలు

Dhanush- Mrunal: మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ ఆమెతో సన్నిహితంగా కనిపించడం ఈ పుకార్లకు ప్రధాన కారణం. వారిద్దరూ చేతులు పట్టుకుని మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ప్రేమ వార్తలు మరింత వేగంగా వ్యాపించాయి. పుట్టినరోజు సందర్భంగా మృణాల్ కోసం ధనుష్ ప్రత్యేకంగా విమానంలో ముంబై వెళ్లడం, అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 స్పెషల్ స్క్రీనింగ్‌కు ఆమెతో కలిసి హాజరవ్వడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.

ధనుష్, మృణాల్ ఒకేచోట కనిపించడం

గతంలోనూ ధనుష్, మృణాల్ (Dhanush- Mrunal) కలిసి కనిపించారు. జూలై 3న రచయిత్రి-నిర్మాత కనికా ధిల్లాన్ ధనుష్ తదుపరి సినిమా తేరే ఇష్క్ మే కోసం ఏర్పాటు చేసిన పార్టీలో మృణాల్ పాల్గొన్నారు. ఆ పార్టీలో సినిమా యూనిట్‌తో కలిసి వీరిద్దరూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులివ్వడం అప్పటినుంచే వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ (Rumors) పెరగడానికి కారణమైంది. అయితే, ఈ వార్తలపై ధనుష్ కానీ, మృణాల్ కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి బంధం గురించి రకరకాల కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లపై వీరు స్పందిస్తారా లేదా చూడాలి.

ధనుష్ మతం ఏమిటి?

ధనుష్ హిందూ దేవుడు శివునికి గొప్ప భక్తుడు మరియు అతని ఇద్దరు కుమారులకు శైవ పేర్లను పెట్టాడు. ధనుష్ శాఖాహారి.

ధనుష్ మొదటి భార్య ఎవరు?

ధనుష్ మొదటి మరియు ఏకైక భార్య ఐశ్వర్య రజనీకాంత్. వారు నవంబర్ 18, 2004న వివాహం చేసుకున్నారు మరియు 18 సంవత్సరాల వివాహం తర్వాత నవంబర్ 27, 2024న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వారికి యాత్ర మరియు లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ustad-bhagat-singh-shooting-in-full-swing/cinema/526237/

Breaking News Celebrity Rumors Dating Speculations Dhanush Kollywood News latest news mrunal thakur Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.