ప్రముఖ నటుడు మరియు దర్శకుడు ధనుష్ తన చిన్ననాటి కల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను చిన్నప్పుడు చెఫ్ కావాలని ఆశపడ్డానని, కానీ జీవితం తనను నటన వైపు తీసుకెళ్లిందని ఆయన చెప్పారు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ‘ఇడ్లీ కడై’ (Idli Kadai) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు.
తరచూ చెఫ్ పాత్రలే ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుంది!
ఈ కార్యక్రమంలో ధనుష్ (Dhanush)మాట్లాడుతూ,
“నాకు తరచూ చెఫ్ పాత్రలే వస్తుంటాయి. దీనికి కారణం నేనో చెఫ్ కావాలని నిజంగా బలంగా కోరుకోవడమే కావచ్చు,” అన్నారు.అయితే ఇది ఒక యాదృచ్ఛికం కాదని, తన కోరిక వల్లే అలాంటి పాత్రలు వస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. “‘జగమే తందిరం’లో పరోటాలు వేశాను, ‘తిరుచిత్రాంబళం’లో ఫుడ్ డెలివరీ బాయ్, ‘రాయన్’లో ఫాస్ట్ ఫుడ్ షాప్ ఓనర్, ఇప్పుడు ‘ఇడ్లీ కడై’లో ఇడ్లీలు వేస్తున్నాను,” అని హస్యంగా చెప్పారు.
“మ్యానిఫెస్టేషన్ అనే పదానికి ఇది ఉదాహరణ కావచ్చు!”
ధనుష్ తన జీవితంలో మ్యానిఫెస్టేషన్ శక్తి ఎంత ప్రభావితం చేసిందో వివరిస్తూ చెప్పారు:
“మనం బలంగా ఏదైనా ఆలోచిస్తే, అది నిజం అవుతుంది. నటుడైన తర్వాత కూడా నా చిన్ననాటి కోరికలు – చెఫ్‌గా కనిపించాలనే అభిలాష – ఇలా పాత్రల రూపంలో నెరవేరుతోంది.”
యువతకు స్పూర్తినిచ్చే సందేశం
ఈ సందర్భంలో ఆయన యువతకు సందేశమిస్తూ,
“మీరు ఏదైనా కలలు కన్నప్పుడు, వాటిని నిజంగా నమ్మండి. లక్ష్యం మీద దృష్టిపెట్టి కష్టపడితే, విజయం నిమిషాల దూరంలో ఉంటుంది”
అని ధనుష్ తెలిపారు. తాను నడిచిన మార్గం కూడా ఇదే అని ఆయన చెప్పినది.
‘ఇడ్లీ కడై’ సినిమా గురించి
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘ఇడ్లీ కడై’ గురించి మాట్లాడుతూ,
“ఇది చాలా సాధారణమైన, గుండెను తాకే కుటుంబ కథ. ఫీల్ గుడ్ ఎమోషన్లతో నిండి ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి తిలకించదగిన సినిమా”అని వివరించారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి డాన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ధనుష్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా, షాలినీ పాండే ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు అరుణ్ విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని భావిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: