బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణే (Deepika Padukone) తన సినీ జీవితంలో ఎన్నో ప్రతిభావంతమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల, ఆమె ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులైన ‘స్పిరిట్’ , ‘కల్కి 2898 ఏడీ 2’ నుంచి వైదొలగడం తెలిసిందే..
Raja Saab: ప్రభాస్ మాస్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్
ఈ నిర్ణయంపై మీడియా, సినీ అభిమానులు, పరిశ్రమలోని వర్గాల్లో విభిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. దీపికా (Deepika Padukone) స్వయంగా ఈ అంశంపై తనదైన పద్ధతిలో స్పందించారు,తనకు ఇబ్బందిగా అనిపించిన ఏ ప్రాజెక్టునూ అంగీకరించనని ఆమె స్పష్టం చేశారు.
దీని ద్వారా ఆమె ప్రస్తుత, భవిష్యత్తు ప్రాజెక్టులపై ఉన్న దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేశారు.ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… “భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు కొన్ని సంవత్సరాలుగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు.
ఈ విషయం ఎప్పుడూ పెద్ద వార్త అవ్వలేదు
వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసి, వారాంతాల్లో పూర్తిగా సొంత పనులకు సమయం కేటాయిస్తారు. కానీ, ఈ విషయం ఎప్పుడూ పెద్ద వార్త అవ్వలేదు” అని ఆమె వివరించారు. ప్రభాస్ (Prabhas) చిత్రాల గురించి నేరుగా ప్రస్తావించకపోయినా, పని గంటల విషయంలోనే తాను ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు ఆమె మాటలు సూచిస్తున్నాయి.
“న్యాయం కోసం పోరాడినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారా?” అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు. నా పోరాటాలు చాలా వరకు నిశ్శబ్దంగానే సాగుతాయి. గౌరవంగా ఉండాలంటే మౌనంగా పోరాడటం నేర్చుకోవాలి” అని ఆమె పేర్కొన్నారు.
సినిమాల నుంచి వైదొలగారంటూ వచ్చిన వార్తలపై
రెమ్యునరేషన్ (Remuneration) కారణంగానే సినిమాల నుంచి వైదొలగారంటూ వచ్చిన వార్తలపై మాత్రం ఆమె స్పందించలేదు.ప్రస్తుతం దీపికా పదుకొణే తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు.
షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రంతో పాటు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కలయికలో రానున్న పాన్-ఇండియా సినిమా (Pan-India cinema) లోనూ ఆమె నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాలతో ఆమె కెరీర్ మరింత ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: