టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌లలో ‘కల్కి 2’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మొదటి ‘కల్కి’ (Kalki) చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత, ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ కలిసి మొదటి భాగానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు రెండో భాగం మరింత గ్రాండియస్‌గా, టెక్నికల్‌గా హై ఎండ్ స్థాయిలో తెరకెక్కబోతోందని చిత్రబృందం ముందే ప్రకటించింది.
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా దీపికా పదుకొనేను ఫైనల్ చేశారు.దీపికా పదుకొనే, దిశా పటాని కథానాయికలుగా నటించారు. కమల్ హాసన్ విలన్‌గా నటించగా.. అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, శోభన తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ (Vyjayanthi Movies Banner) ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ప్రొడక్షన్ విలువలు కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.
కల్కి వంటి సినిమాలకు నిబద్ధత చాలా అవసరం
అయితే ఈ సినిమాకు పార్ట్ 2 (Part 2) త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్‌ను చిత్రబృందం వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే (Deepika Padukone) తప్పుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.కల్కి 2 సినిమాలో దీపికా పదుకొనే భాగం అవ్వట్లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం.
చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ పార్ట్‌నర్‌షిప్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి సినిమాలకు నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్‌లో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ వైజయంతీ మూవీస్ రాసుకోచ్చింది
Read hindi news: hindi.vaartha.com
Read Also: