📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Deepika Padukone – కల్కి 2 నుంచి దీపిక ఔట్..కారణమిదేనా?

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 2:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్‌–ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ విజువల్‌ వండర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రేక్షకులలో అపారమైన హైప్‌ సృష్టించింది. భారీ బడ్జెట్‌, విభిన్నమైన కాన్సెప్ట్‌ కారణంగా ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వటమే కాక, మరోసారి భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రానికి సీక్వెల్‌ వచ్చే వార్త ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఈ సీక్వెల్‌పై తాజాగా ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ నటి దీపిక పదుకొణె తప్పుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) అధికారికంగా ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ మేరకు వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.

చాలా చర్చల తర్వాత మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం

“కల్కి 2898 ఏడీ సీక్వెల్ ప్రాజెక్టులో దీపిక పదుకొణె (Deepika Padukone) భాగం కావడం లేదని అధికారికంగా తెలియజేస్తున్నాము. చాలా చర్చల తర్వాత మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాకు కావాల్సిన పూర్తి నిబద్ధత, భాగస్వామ్యం కుదరలేదు. ఆమె భవిష్యత్ ప్రాజెక్టులకు మా శుభాకాంక్షలు” అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే, ఈ ప్రకటన వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సీక్వెల్‌లో దీపిక పోషించాల్సిన సుమతి పాత్ర (Sumathi’s character) నిడివిని కేవలం అతిథి పాత్ర స్థాయికి తగ్గించడమే ఆమె తప్పుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మొదట కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుందని చెప్పి, ఇప్పుడు మార్పులు చేయడంతో ఆమె బృందం తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం.

పారితోషికం విషయంలోనూ విభేదాలు తలెత్తినట్లు ప్రచారం

మరోవైపు, పారితోషికం విషయంలోనూ విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి భాగం కంటే 25 శాతం ఎక్కువ రెమ్యూనరేషన్ (Remuneration) డిమాండ్ చేయడంతో పాటు, రోజుకు 7 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటానని ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి తోడు తన 25 మంది సిబ్బందికి 5-స్టార్ హోటళ్లలో వసతి కల్పించాలని కోరడం నిర్మాతలకు అదనపు భారంగా మారినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

కాగా, ప్రభాస్ సినిమా నుంచి దీపిక ఇలా మధ్యలో తప్పుకోవడం ఇది రెండోసారి. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమాకు రూ. 20 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటా, రోజుకు 6 గంటల పనివేళలు వంటి డిమాండ్లు పెట్టడంతో పాటు, తెలుగులో డైలాగులు చెప్పడానికి నిరాకరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలతో, ఇప్పుడు ‘కల్కి 2’లో దీపిక స్థానంలో ఏ హీరోయిన్‌ను తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/robo-shankar-dhanush-pays-tribute-to-robo-shankar-on-his-death/cinema/550219/

bollywood actress leaves project Breaking News deepika padukone exit kalki 2898 ad sequel latest news pan india star prabhas Telugu News vyjayanthi movies announcement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.