Decoit Movie Release Date: ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు

Read Time:  1 min
Decoit Movie Release Date: 'డెకాయిట్' కొత్త రిలీజ్ డేట్ ఖరారు
Decoit Movie Release Date: 'డెకాయిట్' కొత్త రిలీజ్ డేట్ ఖరారు
FONT SIZE
GET APP
'Decoit' new release date finalized
‘Decoit’ new release date finalized

Decoit Movie Release Date: యంగ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ విడుదల తేదీలో మార్పు జరిగింది. చిత్ర యూనిట్ తొలుత ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తాజాగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. వేసవి సెలవులను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Virosh Wedding: ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

‘రూబరూ’ పాటలో ఆకట్టుకున్న కెమిస్ట్రీ

సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూనే చిత్ర బృందం ‘రూబరూ’ అనే రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేసింది.భీమ్స్ సిసిరీలియో ‘రూబరూ’ పాటకి బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. చిన్మయి శ్రీపాదతో కలిసి ఆలపించారు. ”మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే..” అంటూ భాస్కర భట్ల రవికుమార్ అర్థమవంతమైన సాహిత్యం అందించారు. ప్రేమలో ఉన్నప్పుడు హీరో మనసులోని భావాలు ఎలా ఉండేవనేది తన లిరిక్స్ తో అందంగా తెలియజెప్పారు.

వినడానికే కాదు, చూడటానికి కూడా ‘రూబరూ’ సాంగ్ చాలా బాగుంది. అడివి శేష్‌ – మృణాల్‌ ఠాకూర్‌ జంట ముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పాటలో వీరి మధ్య లిప్ లాక్ సీన్ కూడా పెట్టారు. అంత ఘాడంగా ప్రేమించుకున్న హీరో హీరోయిన్లు ఎందుకు విడిపోయారు? అడివి శేష్‌ ఒక డెకాయిట్ గా ఎందుకు మారాడు? అతడిని మృణాల్ ఎందుకు మోసం చెయ్యాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే ‘డెకాయిట్‌’ సినిమా చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.