📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

DD Next Level: ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (జీ5)లో స్ట్రీమింగ్

Author Icon By Ramya
Updated: June 14, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

DD Next Level: ఓటీటీలో సంతానం కామెడీ హారర్

సంతానం ఎప్పుడూ తనదైన శైలిలో సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. హారర్, కామెడీ జానర్‌లలో ఆడియెన్స్‌ను మెప్పించడం ఆయనకు అలవాటు. రెగ్యులర్ కమర్షియల్ హీరోగా ప్రయత్నించకుండా, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ల జోలికి వెళ్ళకుండా, తనకు వచ్చిన, తెలిసిన కామెడీనే నమ్ముకుంటారు. అందుకే ‘డీడీ’ ఫ్రాంఛైజీలను అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. గత నెలలో ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level) అంటూ తమిళ ఆడియెన్స్‌ను ఓ మోస్తరుగా మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌ను ఏ మేరకు నవ్విస్తుందో చూద్దాం.

DD Next Level

కథాంశం మరియు విశ్లేషణ

సినిమా కథ విషయానికి వస్తే, హిచ్ కాక్ ఇతియరాజ్ (సెల్వ రాఘవన్) అనే ఒక ఆత్మ, ఫేక్ రివ్యూలు ఇచ్చే వ్యక్తులను టార్గెట్ చేస్తుంటుంది. రివ్యూయర్లను తన థియేటర్లకు ఆహ్వానించి మరీ చంపేస్తుంటాడు. రివ్యూయర్ల కుటుంబాలను కూడా వదిలిపెట్టడు. అలాంటి హిచ్ కాక్ ఒకసారి యూట్యూబ్ రివ్యూయర్ అయిన కిస్సా 47 (సంతానం)కి ఆహ్వానం పంపిస్తాడు. అలా తన కుటుంబంతో వచ్చిన సంతానం థియేటర్ నుంచి బయటకు వెళ్ళాడా? హిచ్ కాక్ పెట్టిన పరీక్షలు ఏంటి? థియేటర్‌లో ప్రదర్శించిన సినిమా ఏంటి? ఆ సినిమా ప్రపంచంలోకి వెళ్ళిన కిస్సా అండ్ ఫ్యామిలీకి ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి కిస్సా తన తెలివితో బయటపడతాడా లేదా? అన్నదే కథ.

‘డీడీ’ ఫ్రాంఛైజీలో వచ్చే చిత్రాల కాన్సెప్ట్ ఒకేలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరో అండ్ గ్యాంగ్, విలన్ గ్యాంగ్ అంతా కూడా చివరికి ఒక పాడుబడ్డ బంగ్లాలోకి లేదంటే దెయ్యం ఉండే భవనంలోకి వెళ్తుంది. అక్కడ కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌ను పుట్టిస్తారు, చివరికి ఏదో ఒకలా ఆ బంగ్లా నుంచి బయటకు వచ్చేస్తుంటారు. సింపుల్‌గా ‘డీడీ’ ఫ్రాంఛైజీల కథ ఇదే. అయితే ప్రతీసారి నవ్వించడంలో, భయపెట్టడంలో సంతానం సక్సెస్ అవుతున్నారు. కామెడీ ట్రాక్‌లు బాగానే క్లిక్ అవుతుంటాయి. ఈ ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ విషయానికి వస్తే కాన్సెప్ట్ కాస్త లాజిక్‌కు దూరంగా, నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అయితే ఇలాంటి హారర్, కామెడీ జానర్‌లకు లాజిక్స్ ఏంటి? అని వదిలేస్తే హాయిగా కొన్ని చోట్ల నవ్వుకోవచ్చు. ఇక ఎలాగూ ఓటీటీలోనే కాబట్టి, ఇంకొన్ని చోట్ల ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకోవచ్చు.

రివ్యూలు మరియు సినిమాపై దర్శకుడి అభిప్రాయం

సినిమా గురించి బాగా తెలిసిన వాడే రివ్యూలు ఇవ్వాలని, చెప్పాలని మరోచోట ఓ డైలాగ్ కనిపిస్తుంది. ఇక ఈ మాట వింటే అందరికీ ఓ డైలాగ్ గుర్తుకు వస్తుందేమో. వంట చేయడం వస్తేనే, మాస్టర్ చెఫ్ అయితేనే టేస్ట్ బాగుందా? లేదా? అనే చెప్పే అర్హత ఉంటుందా? నచ్చిందా? నచ్చలేదా? అని చెప్పడానికి సినిమా తీయడం తెలియాలా? అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇదే చిత్రంలో ‘మంచి సినిమాకు బ్యాడ్ రివ్యూ ఇచ్చినా.. బ్యాడ్ సినిమాకు గుడ్ రివ్యూ ఇచ్చినా జనాలు పట్టించుకోరు.. సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు’ అనే మరో డైలాగ్ కూడా ఉంటుంది. ఇందులో దర్శకుడు ఎవరి కోణం తీసుకున్నారు.. ఆయన వాదన ఏంటి? అన్నది కూడా స్పష్టంగా అర్థం కాదు. ఇలానే మాలీవుడ్‌లో ఓ సినిమా వచ్చింది. బ్యాడ్ రివ్యూల్ని ఇచ్చే వాళ్లని వెతికి వెతికి చంపుతారు. రివ్యూ ఎలా రాశారో అలానే వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటాడు. అది ఓ సీరియస్ మూవీ. కానీ ఇక్కడ డీడీ నెక్ట్స్ లెవెల్ హారర్, కామెడీ జానర్.

ఇక ఇదే చిత్రంలో ‘మంచి సినిమాకు బ్యాడ్ రివ్యూ ఇచ్చినా, బ్యాడ్ సినిమాకు గుడ్ రివ్యూ ఇచ్చినా జనాలు పట్టించుకోరు. సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు’ అనే మరో డైలాగ్ కూడా ఉంటుంది. ఇందులో దర్శకుడు ఎవరి కోణం తీసుకున్నారు, ఆయన వాదన ఏంటి అన్నది కూడా స్పష్టంగా అర్థం కాదు. ఇలానే మాలీవుడ్‌లో ఒక సినిమా వచ్చింది. బ్యాడ్ రివ్యూలు ఇచ్చే వాళ్ళని వెతికి వెతికి చంపుతారు. రివ్యూ ఎలా రాశారో అలానే వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటాడు. అది ఒక సీరియస్ మూవీ. కానీ ఇక్కడ ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ హారర్, కామెడీ జానర్. ఇక్కడ అలాంటి భారీ రక్తపాతం, సీరియస్ మ్యాటర్ ఏమీ కనిపించదు. కానీ రివ్యూలు, రివ్యూల ప్రభావం సినిమా మీద ఉంటుందని ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా చూడకుండానే రివ్యూలు ఇవ్వడం, థియేటర్‌లో కూర్చుని సినిమా చూడకుండానే రివ్యూలు చెప్పడం, లైవ్ అప్‌డేట్లు ఇవ్వడం వంటి వాటిపై సెటైర్లు వేశారు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ మరియు సాంకేతిక అంశాలు

ఇక ఈ కాన్సెప్ట్‌ను కాస్త పక్కన పెడితే, సినిమాలో చూపించిన సినిమా అంత గ్రిప్పింగ్, ఇంట్రెస్టింగ్‌గా ఏమీ అనిపించదు. క్రూయిజ్ షిప్ సీన్లు ఏమీ ఆకట్టుకోవు. ఇక ఐలాండ్‌లోని గెస్ట్ హౌస్ సీన్లు కొన్ని చోట్ల నవ్విస్తాయి. క్యానిబల్స్ ట్రాక్ కూడా ఏమంత ప్రభావం చూపదు. మధ్య మధ్యలో సంతానం, రాజేంద్రన్ కామెడీ ట్రాక్, ఈ ఇద్దరి పంచ్‌లు నవ్విస్తాయి. క్లైమాక్స్‌లో రాజేంద్రన్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు. వీరిద్దరే ఈ సినిమాకు కాస్త ఉపశమనంలా అనిపిస్తారు. గౌతమ్ మీనన్ అసలు ఇలాంటి పాత్రలు ఎందుకు ఒప్పుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. రెడిన్ కింగ్‌స్లే, యషికా, కస్తూరీ శంకర్, నిళగళ్ రవి ఇలా అందరి పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.

టెక్నికల్‌గా ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ మూవీ పర్వాలేదనిపిస్తుంది. అంతా ఒకే చోట కథను చూపిస్తారు. లొకేషన్స్ కూడా పెద్దగా ఉండవు. సాంగ్స్ అంతగా గుర్తుండవు. తెలుగు డబ్బింగ్ అంతా సెట్ కాలేదనిపిస్తుంది. డైలాగ్స్, పంచ్‌లు బాగుంటాయి. హారర్ ఎలిమెంట్స్ కూడా మరీ అంతగా ఏమీ ఉండవు. ఆర్ఆర్ కొన్ని చోట్ల భయపెట్టించేలా ఉంటుంది. ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level) అనే సినిమా పేరుకు తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఏమీ లేదు. సంతానం-రాజేంద్రన్ ట్రాక్, కొన్ని చోట్ల కామెడీని ఎంజాయ్ చేసేలా, ఒకసారి ఎంజాయ్ చేసే టైం పాస్ మూవీలా అనిపిస్తుంది.

Read also: Squid Game 3: ‘స్క్విడ్‌గేమ్ 3’ ట్రైలర్ ఎలా ఉందంటే?

#ComedyHorror #DDNextLevel #OTTReview #Review #Santhanam #TamilCinema #TeluguCinema #TimepassCinema Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.