Latest News: Kalki Movie: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD

Read Time:  1 min
Kalki Movie
Kalki Movie
FONT SIZE
GET APP

ముంబై నగరంలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival – DPIFF) 2025 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్‌ సహా పలు భాషల సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Read Also: Shambhala Movie: శంబాల ట్రైల‌ర్‌ విడుదల

ఈ వేడుకలో టాలీవుడ్‌కి గర్వకారణంగా నిలిచింది ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ (Kalki Movie) చిత్రం. ఇది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ (Film of the Year) అవార్డు అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తన విజువల్ గ్రాండియర్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్, కథా నిర్మాణం, ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ నటనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Kalki Movie
Kalki Movie

ఈ అవార్డు ద్వారా తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హర్రర్ కామెడీ జానర్‌లో సంచలనం సృష్టించిన‘స్త్రీ-2’ బెస్ట్ మూవీలుగా నిలిచాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-2), బెస్ట్ యాక్టర్‌గా కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్‌గా కృతి సనన్‌, బెస్ట్ డైరెక్టర్‌గా కబీర్‌ఖాన్‌కు అవార్డులు దక్కాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.