📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

D55: ధనుష్ మూవీ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి

Author Icon By Anusha
Updated: February 4, 2026 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని (D55) ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్న వేళ, తాజాగా చిత్రబృందం ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను విడుదల చేసి అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Read Also: Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి వార్తలపై మృణాల్ క్లారిటీ

మొదటి సినిమా

ఈ విషయానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.ధనుష్, మమ్ముట్టి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు దాదాపు ఏడేళ్ల (2019లో వచ్చిన ‘పేరంబు’) తర్వాత మమ్ముట్టి తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం.ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ధనుష్ స్వయంగా తన వండర్‌బార్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్‌టేక్ స్టూడియోస్‌తో కలిసి ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

D55 movie Dhanush latest news Mammootty Rajkumar Periasamy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.