📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: CP Sajjanar: ఐ బొమ్మ రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా

Author Icon By Anusha
Updated: November 17, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిజిటల్ యుగంలో చిత్ర పరిశ్రమను అత్యంత వేధిస్తున్న సమస్య పైరసీ. ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో iBomma వెబ్‌సైట్ సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టానికి కారణమవుతున్నది. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi ravi) ను హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. ఐ బొమ్మలో 21వేల సినిమాలున్నాయన్నారు.

Read Also: Rasha Thadani: అజయ్ భూపతి సినిమాలో హీరోయిన్‌గా రాషా తదాని

ప్రధాన నిందితుడు రవి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు రవి రూ.20 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. దీని వెనక పెద్ద రాకెట్ ఉందని, ఒక వెబ్ సైట్ బ్లాక్ చేస్తే వెంటనే మరో వెబ్ సైట్ ఓపెన్‌ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో సినీ పెద్దలు భేటీ అయ్యారు.

అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

50 లక్షల సబ్‌స్క్రైబర్ల డేటా ఉందని

ibomma వెబ్ సైట్లో 50 లక్షల సబ్‌స్క్రైబర్ల డేటా ఉందని సీపీ సజ్జనార్ (CP Sajjanar) చెప్పారు. పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని, దీన్ని కట్టడి చేయడానికి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లతో తన సామాజ్రాన్ని రవి ఏర్పాటు చేసుకున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. రవి గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీలకు సీఈవోగా ఉన్నారని తెలిపారు. తన టీంతో కలిసి యూకే నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నారన్నారు.

i Bomma Ravi has data of 50 lakh subscribers

మరో వెబ్‌సైట్‌ను వాడుకుంటూ సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారన్నారు

వివిధ వీపీఎన్‌‌లతో పలు లొకేషన్లు మారుస్తూ.. వెబ్‌సైట్‌లో సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారు. పైరసీ సినిమాల అప్‌లోడ్ కోసం వందకు పైగా వెబ్‌సైట్‌‌లు కొనుగోలు చేశారు. పైరసీ బయటపడి ఒక వెబ్‌సైట్‌‌ తొలగించినా.. మరో వెబ్‌సైట్‌ను వాడుకుంటూ సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారన్నారు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లలో రెండువేలకు పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

పైరసీ నెట్‌వర్క్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్స్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. ఇప్పటికే రవిపై 7 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా

ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ‘‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నాడు.

దీంతో చాలా మంది చనిపోయారు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేస్తే కొత్త సైట్‌ను తయారు చేశాడు. ఇలా65 మిర్రర్‌ వెబ్‌సైట్లు నిర్వహించాడు. 21 వేల సినిమాలు అతడి హార్డ్‌ డిస్క్‌లో ఉన్నాయి. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్‌ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. రూ.20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడు.

అందులో రూ.3 కోట్లు సీజ్‌ చేశాం. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం’’ అని సజ్జనార్‌ (CP Sajjanar) తెలిపారు.  కాగా ఇమ్మడి రవిని అరెస్ట్‌ చేసి సినిమా పరిశ్రమకు మేలు చేకూర్చిన పోలీస్‌ సిబ్బందికి దర్శక, నిర్మాతలు, నటులు కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Hyderabad police Sajjanar Ibomma Case latest news Ravi arrest Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.