📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajendra Prasad:  ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Comments on MGR.. Rajendra Prasad apologizes

Rajendra Prasad: ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, తెలుగు చలనచిత్ర దిగ్గజం కాంతారావు గారి వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని కొనియాడారు. ఈ క్రమంలో ఆయన తమిళ లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ (M.G. Ramachandran) ప్రస్తావనను తీసుకువచ్చారు. కాంతారావు గారి గొప్పతనాన్ని విడమరిచి చెప్పే ప్రయత్నంలో ఎంజీఆర్‌పై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, తమిళ అభిమానులను, సినీ వర్గాలను నొప్పించాయి.

Read Also: Hansika Motwani : విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

తమిళంలో వీడియో సందేశం.. క్షమించమని విన్నపం

ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు మాట్లాడలేదని, అనుకోకుండా ఆ వ్యాఖ్యలు దొర్లాయని అన్నారు. అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు.తమిళ సినిమా ప్రేక్షకుల వలె నేను కూడా ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తానని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

కాంతారావును ప్రశంసించే క్రమంలో అనుకోకుండా నోరు జారానని అంగీకరించారు. అనుకోకుండా జరిగిన ఈ అంశాన్ని కొందరు పెద్దది చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తాను చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న సమయంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తాము నటిస్తుంటే ఆయన వచ్చి చూసేవారని, అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడగలనా అని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Apology Video MGR Rajendra Prasad Rajendra Prasad Comments on Kantha Rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.