📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Chiranjeevi: నేడే చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్.. 

Author Icon By Saritha
Updated: January 4, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఫుల్ స్వింగ్‌లో ప్ర‌మోష‌న్స్ చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటివరకు విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు అసలు హైలైట్ అయిన ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో ఘనంగా లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌తోనే నాన్‌స్టాప్ ప్రమోషన్లకు తెరలేవనుంది.

Read also: Irrigation Projects: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలకు ఏపీ ఖండన

నేడు తిరుపతిలో ఘనంగా సినిమా ట్రైలర్ విడుదల

ట్రైలర్ రిలీజ్ అనంతరం వరుసగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రాంతాల్లో భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. (Chiranjeevi) ఈ ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే రాజమండ్రి రేవు వద్ద సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగా అభిమానులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు హాజరై ఈ ఈవెంట్‌ను మరింత సందడిగా మార్చారు. ఇక తిరుపతి తర్వాత జనవరి 5న నెల్లూరు, 6న విశాఖపట్నం, 7న హైదరాబాద్, 8న తాడేపల్లిగూడెం, 9న అనంతపూర్, 10న వరంగల్, 11న బెంగళూరు… ఇలా మూడు రాష్ట్రాలను కవర్ చేస్తూ ప్రమోషన్ టూర్ కొనసాగనుంది. ప్రీమియర్స్ రోజు వరకు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరిగేలా ప్లానింగ్ చేసినట్టు సమాచారం.

మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో చిత్ర బృందం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరపాటి, రామజోగయ్య శాస్త్రి శ్రీవారిని దర్శించుకోగా, వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 20 సెకన్లు ఉండబోతుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై మరింత స్పష్టత రానుందని, మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు ఇంకా పెరగనున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Anil Ravipudi Chiranjeevi Latest News in Telugu Mana Shankara Varaprasad Garu Mega Star Sankranti Release Telugu movie trailer Telugu News tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.