📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chiranjeevi: క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: January 26, 2026 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Chiranjeevi’s key comments on casting couch

సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన, చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఆదివారం సాయంత్రం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించింది.

Read Also: Prabhas: ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప ఇండస్ట్రీ

ఈ కార్యక్రమంలో చిరంజీవి చేసిన ప్రసంగం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పలు అంశాలపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప ఇండస్ట్రీ అని పేర్కొన్న ఆయన.. ఇక్కడ ఎవరి ప్రవర్తనతో వారు ప్రొఫెషనల్‌గా, క్రమశిక్షణతో, స్ట్రిక్ట్‌గా ఉంటే క్యాస్టింగ్‌ కౌచ్‌ వంటి సమస్యలకు తావుండదన్నారు. ఇండస్ట్రీలో రాణించలేకపోతే అది వారి వ్యక్తిగత తప్పిదమేనని స్పష్టం చేశారు.

తాము ప్రొఫెషనల్‌గా ఉంటే ఎదుటివారు కూడా అదే విధంగా వ్యవహరిస్తారని చిరంజీవి (Chiranjeevi) వ్యాఖ్యానించారు. తన మాటలకు ఉదాహరణగా చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదెలను ప్రస్తావించారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఆమె ప్రొఫెషనల్‌గా, క్రమశిక్షణతో తన పనిని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. అలాగే దత్తుగారి పిల్లలు స్వప్న దత్ లాంటి వారు కూడా తమ శ్రమ, ప్రతిభతో పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే యువత కృతనిశ్చయంతో, హార్డ్‌వర్క్‌పై నమ్మకం పెట్టుకుని రావాలని చిరంజీవి సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Casting Couch Chiranjeevi latest news Mana Shankara Varaprasad Garu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.