మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. “అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం.. పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు అంజనా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Prabhas upcoming Movies: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!
మెగా కుటుంబానికి అంజనా దేవి ఒక అండగా, ధైర్యంగా ఉంటారని చిరు ఎప్పుడూ చెబుతుంటారు. గత ఏడాది కూడా ఆమె పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. కొణిదెల వెంకట్రావు – అంజనా దేవి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడైన చిరంజీవి (Chiranjeevi) సినీ రంగంలో తిరుగులేని మెగాస్టార్‌గా ఎదిగారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రాంతీయ చిత్ర పరిశ్రమలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించారు. రెండో కుమారుడు నాగబాబు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ప్రజాసేవ కొనసాగిస్తున్నారు. మూడో కుమారుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: