📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Chirajnjeevi – మోహన్ లాల్‌కుఅభినందనలు తెలిపిన చిరంజీవి

Author Icon By Anusha
Updated: September 21, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ నటుడు, సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Dadasaheb Phalke Award)దక్కబోతోందని అధికారికంగా ప్రకటించారు. 2023 సంవత్సరానికి ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మోహన్‌లాల్‌, నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపు ఇవ్వడమే కాక, భారత సినీ పరిశ్రమలో ఆయన ప్రాముఖ్యతను మరింత పెంచింది.

ఈ నేపథ్యంలో మోహన్‌ లాల్‌(Mohanlal)కు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ తన విషెస్‌ అందించాడు.తాజాగా టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chirajnjeevi) ఎక్స్‌ వేదికగా చిరకు విషెస్‌ తెలియజేశాడు.ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్న నా ప్రియమైన లాలెట్టన్ @ మోహన్ లాల్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన సినీ ప్రయాణం, ఐకానిక్ ప్రదర్శనలు భారతీయ సినిమాను మరింత సుసంపన్నం చేశాయి.

సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా

మీ ప్రతిభకు నిజమైన తగిన గుర్తింపు ఇది.. అంటూ ఎక్స్‌ (X) లో ట్వీట్ చేశాడు చిరు. మోహల్‌ లాల్‌, చిరంజీవి ఆప్యాయంగా కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయగా ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.భారత సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా మోహన్‌లాల్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికచేశామని సమాచార, ప్రసార శాఖ పేర్కొంది.

భారత సినిమా రంగంలో కొన్ని తరాలపాటు ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని కొనియాడింది. ఈ నెల 23న జరుగనున్న 71వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో మోహన్‌లాల్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు.మోహన్‌లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం కేవలం ఆయన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాక, మలయాళ, తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు ప్రతిష్టను తీసుకువస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఆయన పేరును సుస్థిరంగా నిలిపే ఈ ఘట్టం, అభిమానులకు, సినీ పరిశ్రమకు ఒక గొప్ప శుభవార్తగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dulquer-salmaan-clarifies-on-loka-ott-release/cinema/551565/

Breaking News Chiranjeevi Dadasaheb Phalke Award film industry honors Indian Cinema latest news Malayalam superstar Mohanlal Pawan Kalyan wishes Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.