పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (OG Movie) ప్రస్తుతం సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చాలా కాలం తర్వాత ఇలాంటి ప్యూర్ యాక్షన్ డ్రామా రాగానే అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకున్నారు.
Shalini Pandey: ఆ సినిమా వల్లే నాకు గుర్తింపు వచ్చింది : షాలిని పాండే
సినిమా విడుదలైన మొదటి రోజే పవన్ ఎంట్రీ నుంచి ఫ్యాన్స్ థియేటర్లలో హంగామా చేశారు. పవన్ యాక్టింగ్, అతడి స్టైల్, డైలాగ్ డెలివరీ, అలాగే సుజీత్ (Sujeeth) చూపిన పవర్‌ఫుల్ ఎలివేషన్స్ ప్రేక్షకులను మైమరిపించాయి. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను మరింత హైలైట్ చేస్తూ, థియేటర్లలో వాతావరణాన్ని రగిలించింది.
విడుదలైన నాలుగైదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కు మంచి యాక్షన్ డ్రామా అందించారు సుజీత్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తమన్ మ్యూజిక్ ఇరగదీశాడు
ఇందులో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, సత్య రాజ్ కీలకపాత్రలు పోషించగా.. తమన్ మ్యూజిక్ ఇరగదీశాడు. తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమాను చూశారు.మెగా ఫ్యామిలీ కోసం సోమవారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad)లోని ప్రసాద్ ల్యాబ్ లో ఓజీ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
పవన్ కళ్యాణ్ తోపాటు చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అకీరా నందన్, ఆద్య, చిరు మనవరాళ్లు ఈ షోకు హాజరయ్యారు.
ఇలా అందరూ కలిసి సినిమా చూడడం చాలా
అలాగే అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ , సుజీత్, థమన్ సైతం వీరితో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.మెగా ఫ్యామిలీలో చాలా మంది సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఇలా అందరూ కలిసి సినిమా చూడడం చాలా అరుదు. ప్రస్తుతం మెగా హీరోస్ అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పవన్ సినిమాను కుటుంబమంతా కలిసి సినిమా చూడడం బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొవాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: