Chinmayi-Kamal Haasan: కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

Read Time:  1 min
Chinmayi-Kamal Haasan: కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?
FONT SIZE
GET APP

Chinmayi-Kamal Haasan: కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్ అవార్డును ఆయన అందుకోనున్నారు. వైరముత్తుకు రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.సుదీర్ఘమైన, విశిష్టమైన సంప్రదాయంతో పరిఢవిల్లుతున్న తమిళ సాహిత్యానికి మూడోసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారం అయిన జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. జయకాంతన్ గారు జ్ఞానపీఠ్ అందుకున్న తర్వాత, ఇన్నేళ్లకు తమిళానికి ఈ గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన నా ప్రియ మిత్రుడు కవిపేరరసు వైరముత్తుకి శుభాకాంక్షలు.

Read Also: Ustaad Bhagat Singh Trailer Release: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

ఆయన తమిళ భాషకు ఈ అపారమైన కీర్తిని తెచ్చిపెట్టారు. “ఆకాశం నాకు ఒక బోధి వృక్షం వంటిది.. అది ప్రతిరోజూ నాకు ఒక సందేశాన్ని మోసుకొస్తుంది” అనే కవితా పంక్తుల ద్వారా మొదట నా చెవులను తాకి, నా హృదయంలోకి ప్రవేశించి, నా జీవితంలో ఒక అవిభాజ్య భాగంగా మారిన నా మిత్రుడికి అభినందనలు తెలియజేయడంలో నాకు ఎంతో గర్వంగా ఉంది” అని కమల్ హాసన్ ఎక్స్ లో పేర్కొన్నారు.

Chinmayi-Kamal Haasan: Singer Chinmayi is angry with Kamal Haasan.. Do you know the reason?
Chinmayi-Kamal Haasan: Singer Chinmayi is angry with Kamal Haasan.. Do you know the reason?

మహిళా ఓటర్లకు హెచ్చరిక

వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్ రావడాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేసిన కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద మండిపడ్డారు. కమల్ హాసన్ పోస్టుని ట్యాగ్ చేస్తూ.. ”ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. అంకుల్(వైరముత్తు) లైంగికంగా వేధించాడని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి” అని చిన్మయి రాసుకొచ్చింది.

గతంలో ‘మీటూ’, కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైరముత్తు తనను వేధించాడని చిన్మయి ఆరోపించింది. ఇప్పుడు ఆయనే కేంద్ర అత్యున్నత సాహితీ పురష్కారం రావడం, వైరముత్తుని కమల్ హాసన్ అభినందించడంతో చిన్మయి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.