📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

‘ఛావా’ తెలుగు ట్రైల‌ర్

Author Icon By Anusha
Updated: March 3, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌లో ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతున్న సినిమా ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా హిందీలో రిలీజ్‌కు ముందే వివాదాల మధ్య చిక్కుకుంది. కానీ విడుదలైన తరువాత మాత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.

ఛత్రపతి శివాజీ కథ

ఈ సినిమా మహారాష్ట్ర వీర యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఆయన పోరాటం, ధైర్యం, దేశభక్తిని సినిమాలో అద్భుతంగా చూపించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేశ్ విజన్ నిర్మించారు.

బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు

ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన తొలిరోజు నుంచే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పడిపోయాయి. సినిమా కంటెంట్, గ్రాండ్ విజువల్స్, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటివరకు ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ బిగ్ హిట్‌గా నిలిచింది.

తెలుగులో రిలీజ్

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. ఈనెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ధైర్యం, కీర్తి ఆవిష్కృతమైన అద్భుతమైన దృశ్యకావ్యం ఇప్పుడు తెలుగులో వస్తోందంటూ ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల ప్రేక్షకుల నుంచి స్పందన

తాజాగా విడుదలైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. మొత్తం 3 నిమిషాలు ఉన్న ట్రైలర్ వీడియోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.ఛావా సినిమాని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ చాలా హృద్యంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహరాజ్ మొఘలులతో చేసిన యుద్ధం, మరాఠా సామ్రాజ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సన్నివేశాలు ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అలానే క్లైమాక్స్‌లో ఔరంగజేబు చేతిలో శంభాజీ నరకం చూసిన సన్నివేశాలు చూసి ఆడియన్స్‌ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాని చూస్తూ ఆడియన్స్ ఎంతోమంది ఎమోషనల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

#Bollywood #BoxOfficeHit #Chhava #ChhavaTrailer #GeethaArts #March7Release #RashmikaMandanna #ShivajiMaharaj #TeluguRelease #VickyKaushal Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.