📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Cheekatilo: ‘చీకటిలో’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Author Icon By Saritha
Updated: January 23, 2026 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెలుగు నుంచి వచ్చిన మరో సినిమానే ‘చీకటిలో’ (Cheekatilo). శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala) ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత ఆమె చేసిన ఈ సినిమా, నేరుగా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

Read Also: Sunita Williams- Prakash Raj: వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

‘Cheekatilo’ (Amazon Prime) Movie Review!

కథ

సంధ్య అనే మిడిల్ క్లాస్ అమ్మాయి టీవీ ఛానల్ జర్నలిస్ట్‌గా పని మానేసి సొంతంగా క్రైమ్ పాడ్‌కాస్ట్ ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆమె స్నేహితురాలు బాబీ హత్యకు గురవుతుంది. ఈ కేసును తవ్వుతూ సంధ్య రియల్ క్రైమ్ స్టోరీస్‌తో పాప్యులర్ అవుతుంది. సీరియల్ కిల్లర్ హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో ఆమె గోదావరి జిల్లాల వరకు వెళ్లి ప్రమాదకరమైన నిజాలను ఎదుర్కొంటుంది.

‘చీకటిలో ‘ అనే టైటిల్ తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే చీకటికి అవతల ఏం జరుగుతుందో తెలుకోవాలనే ఒక క్యూరియాసిటీ చాలామందిలో ఉంటుంది. అందువలన తెరపై వరుస హత్యలు ఎలా జరిగాయి? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం (Cheekatilo) కథ వెంట ప్రేక్షకులు పరిగెత్తడం మొదలుపెడతారు. ‘పాడ్ కాస్ట్’ ద్వారా రియల్ క్రైమ్ స్టోరీస్ చెప్పే ఒక యువతీ, సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి తానే రంగంలోకి దిగడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సంధ్య అనే పాత్ర ఒక బలమైన నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగుతుంది. ఏది ఏమైనా ఆమె ఆ పనిని సాధించి తీరాలి. అంత డేరింగ్ గా డైనమిక్ గా ఆ పాత్ర ఉండాలి. కానీ ఆ స్పీడ్ తో ఆ పాత్ర ముందుకు వెళ్లకపోవడం ఎప్పటికప్పుడు డీలాపడిపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. ‘చీకటిలో’ అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ, ఇది ఓ మాదిరి కంటెంట్ అనే చెప్పుకోవలసి ఉంటుంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amazon Prime Video Cheekatilo Movie Crime Thriller Latest News in Telugu OTT Release Shobhita Dhulipala telugu movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.