భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మందాన (Smriti Mandhana),మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆయన ఈ ఫిర్యాదును అందజేశారు.
Read Also: Jasprit Bumrah: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న బుమ్రా
దర్యాప్తు జరుగుతోంది
ఫిర్యాదు వివరాల ప్రకారం స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడైన వైభవ్ మానే వృత్తిరీత్యా సినీ ఫైనాన్షియర్. సాంగ్లీకి వచ్చినప్పుడు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ద్వారా పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) అతనికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో “నజరియా” అనే సినిమా తీస్తున్నానని, పెట్టుబడి పెడితే ఓటీటీలో విడుదల చేసి త్వరగా లాభాలు అందిస్తానని పలాశ్ హామీ ఇచ్చారని వైభవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలాశ్ ముచ్చల్ మాటలు నమ్మి, వైభవ్ మానే సినిమా నిర్మాణం కోసం మొత్తం రూ. 40 లక్షలను పలు విడతల వారీగా అందించారు.
ఇందుకు సంబంధించిన లావాదేవీల వివరాలు, పత్రాలను కూడా పోలీసులకు సమర్పించారు. అయితే, ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని వైభవ్ అడగగా, మొదట హామీ ఇచ్చిన పలాశ్ (Palash Muchhal) ఆ తర్వాత ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేసి, చివరికి అతని నంబర్‌ను బ్లాక్ చేశారని బాధితుడు ఆరోపించారు.నెలల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన వైభవ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైభవ్ సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: