📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Latest News: James Cameron: థియేటర్ టెక్నీషియన్లకు కామెరూన్ ప్రత్యేక లేఖ

Author Icon By Anusha
Updated: December 15, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’. (‘Avatar: Fire and Ash’) దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే అవతార్ సిరీస్ గత భాగాలు సంచలనాలు సృష్టించాయి.‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు కూడా ఊపందుకున్నాయి. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’లో పాండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Read Also: Prakash Raj: ఆ మూవీలో మహేష్‌బాబుకు తండ్రిగా ప్రకాష్‌రాజ్?

కొన్ని సూచనలు, హెచ్చరికలు చేశారు

సినిమా విడుదలకు రోజులు దగ్గర పడుతుండటంతో, జేమ్స్ కామెరూన్ (James Cameron) ఈసారి కేవలం ప్రమోషన్లకే పరిమితం కాకుండా థియేటర్ల నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా ఆయన థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేక లేఖ రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేఖలో జేమ్స్ కామెరూన్ చాలా స్పష్టంగా కొన్ని సూచనలు, హెచ్చరికలు చేశారు.

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ను ప్రేక్షకులకు అందించేందుకు తనతో పాటు తన టీమ్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాతో పాటు పంపిన DCPలో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్ ఉన్నాయని, వాటిని తప్పకుండా పాటించాలని సూచించారు. ముఖ్యంగా లైట్ లెవల్స్, సరైన ఫ్రేమింగ్,

ఆడియో కాన్ఫిగరేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.ఈ సినిమాను తానే వ్యక్తిగతంగా మిక్స్ చేశానని జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. నిశ్శబ్దమైన డైలాగ్ సన్నివేశాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ వరకు పూర్తి డైనమిక్స్ ప్రేక్షకులకు చేరాలంటే 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించవద్దని ఆయన చెప్పారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

avatar fire and ash Avatar movie James Cameron latest news Telugu News theater warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.