టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ ‘బుక్ మై షో’పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల టికెట్లు అమ్మే ఈ యాప్‌లో రేటింగ్ వ్యవస్థపై ఆయన తీవ్రమైన ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో సినిమా భవిష్యత్తు నిర్ణయమవుతుందనే విధానం వల్ల, పరిశ్రమ మొత్తం నష్టపోతుందని ఆయన అన్నారు.
Read Also: How to Train Your Dragon: హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ
“ఒక సినిమా చూసి నచ్చకపోతే కొందరు వెంటనే యాప్‌లో తక్కువ రేటింగ్ ఇస్తున్నారు. దాంతో ఆ సినిమా నాణ్యత ఎలా ఉన్నా, టికెట్ బుకింగ్స్ (Ticket bookings) తక్షణమే పడిపోతున్నాయి. ఈ విధానం సినిమా (movie) బిజినెస్‌కు తీవ్ర నష్టం చేస్తోంది. బుక్ మై షో లాంటి సంస్థలు కేవలం టికెట్లు అమ్మడానికే పరిమితం కావాలి.
వారు రేటింగ్స్ అనే జడ్జ్‌మెంట్ వ్యవస్థను తొలగించాలి” అని బన్నీ వాసు (Bunny Vasu) స్పష్టంగా అన్నారు.వివరాల్లోకి వెళితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే జర్నలిస్టులు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారని, అలాంటప్పుడు ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు.
సినిమా మీదే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు
టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే ఒక సినిమా బాగుంది, బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.మీరు కూడా సినిమా మీదే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు కదా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అంటూ బుక్ మై షో (Book My Show) యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఈ రేటింగ్స్ కారణంగా సినిమా నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇదిలా ఉండగా, బన్నీ వాసు సమర్పకుడిగా ‘మిత్రమండలి’ అనే కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: