ప్రసిద్ధ సినిమా నిర్మాణ సంస్థ ఏవీఎం స్టూడియోస్ అధినేత,(Breaking News) దశాబ్దాల పాటు సినీరంగానికి సేవలు అందించిన నిర్మాత ఎం. శరవణన్(M. Saravanan) మృతి చెందారు. వయోభారం కారణంగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
Read also: లోన్ యాప్స్ బ్యాన్ చేసిన కేంద్రం?
ఏవీఎం వారసత్వాన్ని మరింత బలపరిచిన శరవణన్
శరవణన్(Breaking News) తన తండ్రి ఏవీ మెయప్పన్ స్థాపించిన ఏవీఎం ప్రొడక్షన్స్ ను మరింత విస్తరించి, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగులో ఆ ఒక్కటీ అడక్కు, సంసారం ఒక చదరంగం, లీడర్ వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. మెయప్పన్ తర్వాత నిర్మాణ బాధ్యతలు చేపట్టిన శరవణన్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి మహానటులతో అనేక ప్రాజెక్టులను విజయవంతం చేశారు. ఆయన కుమారుడు ఎం.ఎస్. గుహన్ కూడా నిర్మాణ రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: