📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking News: BRAT: ‘బ్రాట్’ ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Author Icon By Saritha
Updated: December 15, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కృష్ణ కథానాయకుడిగా(BRAT) తెరకెక్కిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘బ్రాట్’, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శశాంక్(Shashank) దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన పొందింది.కొన్ని రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘బ్రాట్’, ఈ నెల 13 నుంచి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

Read also:  Aromale OTT release: ‘ఆరోమలే’ మూవీ రివ్యూ!

కథ

కృష్ణ (డార్లింగ్ కృష్ణ) అనే యువకుడు(BRAT) ఫ్రెండ్స్‌ను వెంటపెట్టుకుని జులాయిగా తిరుతుంటాడు. ఈజీ మనీ కోసం కలలు కంటూ క్రికెట్ బెట్టింగ్స్‌కు పాల్పడుతూ ఉంటాడు. అయితే, క్రిస్టీ తండ్రి మాత్రం ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మరి కొడుకు బెట్టింగులకు పాల్పడుతున్నాడని తెలుసుకున్న తండ్రి ఏం చేశాడు? క్రిస్టీ బెట్టింగ్స్ వల్ల అతనితో పాటు అతని ఫ్యామిలీ ఎలాంటి చిక్కుల్లో పడింది. తండ్రి-కొడుకుల ఫైటింగ్ ఎంత వరకు వెళ్లింది? చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ

క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతోమంది ఈ ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాంటి క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. క్రికెట్ బెట్టింగ్ అనే మాట చాలామంది .. చాలా చోట్ల విని ఉంటారు. అలాంటి క్రికెట్ బెట్టింగ్ ఎలా జరుగుతుంది? ఆ మాయలో పడినవాళ్లు ఎలా తమ డబ్బు పోగొట్టుకుంటారు? తెర వెనుక ఏం జరుగుతూ ఉంటుంది? అనేది స్పష్టంగా చూపించిన సినిమా ఇది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Amazon Prime Video Brat movie Breaking News in Telugu Kannada action thriller Krishna actor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.