📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Brahmanandam – రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు: బ్రహ్మానందం

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదానికి పర్యాయపదంగా నిలిచిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) తన జీవన యాత్రను అక్షరరూపంలోకి మలిచారు. ఆయన రాసిన ఆత్మకథ ‘ME and मैं’ ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తన అనుభవాలను, జీవితంలోని ఎన్నో మలుపులను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.బ్రహ్మానందం మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం ఎప్పుడూ లేనని, తనకు రాజకీయ నేపథ్యం కూడా లేదని స్పష్టంచేశారు.

“నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. జీవితం మొదట్లో చాలా కష్టాలే ఎదురయ్యాయి. ఉపాధ్యాయుడిగా నా ప్రయాణం ఆరంభమైంది. అయితే నటనపై ఉన్న అమితాసక్తి నన్ను సినిమా రంగం (Film industry) లోకి తీసుకొచ్చింది. అదృష్టం కలిసివచ్చి, ప్రేక్షకులు చూపిన మమకారం వల్లే ఇంతదూరం వచ్చాను” అని ఆయన చెప్పారు.బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘నేను ఈ పుస్తకం రాయడానికి ఎంతో మంది స్ఫూర్తి ఇచ్చారు.

నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు

ఎంతో మంది మహానుభావులు చిన్న స్థాయి నుంచి నేడు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నారు.1200కి పైగా సినిమాలు చేశానంటే అది కచ్చితంగా ఆ నటరాజస్వామి ఆశీర్వాదంతో పాటు ప్రేక్షకుల అభిమానం, ప్రేమే కారణం’ అని చెప్పుకొచ్చారు.నా జీవితంలోని ఎత్తుపల్లాలు, సినీ ప్రయాణంలో పడిన కష్టాలు, అందుకున్న సత్కరాలు అన్నీ ఈ పుస్తకంలో రాశాను. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ (Political background) లేదు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి కూడా లేదు. నా జీవితంలో సినీ రంగానికే అంకితం చేశారు. నా పదవికి విరమణ ఉంటుందేమో కానీ పెదవికి ఉండదు.

Brahmanandam

మనం ఎంతో పవిత్రంగా చూసే కమలం బురద నుంచే పుడుతుంది. అలాగే కష్టపడి పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ విషయంతో వెంకయ్యనాయుడు నాకు ఎంతో ప్రేరణగా ఉంటారు. ఈ మధ్య సినిమాలు తగ్గించేసినా మీమర్స్ నన్ను వైరల్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య గ్లోబల్ కమెడియన్‌గా అవార్డు కూడా ఇచ్చారు. నన్ను కమెడియన్‌ నుంచి మీమ్స్ బాయ్‌గా మార్చేశారు. ఏం చేసినా పది మందిని నవ్వించడమే నా జీవిత లక్ష్యం’ అన్నారు బ్రహ్మానందం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం అలుపెరుగని ఆర్టిస్ట్. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు.

నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది: వెంకయ్యనాయుడు

హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీసుకొచ్చిన ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. ఈ పుస్తకం ఆరు భాషల్లో వస్తోంది. బ్రహ్మానందం 1200 సినిమాల్లో నటించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మాతృభాషని నేర్చుకోవాలి. అలాగే మనదేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. దేశం దాటి బయటికి వెళితే ఇంగ్లీష్ రాకపోతే బతకలేం. అందుకే ప్రతి ఒక్కరూ మాతృభాషతో పాటు మనకి అవసరమైన ఇతర భాషల్ని కూడా నేర్చుకోవాలి’ అని ప్రసంగించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/renu-desai-comments-viral-on-social-media/cinema/546334/

4687 centers upgraded Andhra Pradesh Anganwadi services Breaking News Government Decision latest news mini Anganwadi to full-fledged strengthened services Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.