Boyapati Srinu Tirumala Visit: శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

Read Time:  1 min
Boyapati Srinu Tirumala Visit: శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం
FONT SIZE
GET APP

Boyapati Srinu Tirumala Visit: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని (TTD) దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి చేరుకున్న ఆయన, ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బోయపాటి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది, అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

Read Also: Iran Israel War: దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

Boyapati Srinu Tirumala Visit: శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం
Boyapati Srinu Tirumala Visit: Director Boyapati’s family in the service of Srivari

అర్చకుల ఆశీర్వచనం.. తీర్థ ప్రసాదాల స్వీకరణ

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు బోయపాటి శ్రీను కుటుంబానికి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు వేగంగా దర్శనబాగ్యం కల్పిస్తున్నారని వివరించారు. త్వరలో తాను చేయబోయే సినిమాకు సంబంధించిన కథ చర్చల దశలో ఉందని, త్వరలో కొత్త సినిమా వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.