📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Latest News: Chennai: నటుడు ప్రభు నివాసానికి బాంబు బెదిరింపు

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చెన్నై (Chennai) లో ప్రముఖ సినీ నటుడు ప్రభు నివాసానికి, అలాగే అమెరికా రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్‌తో తమిళనాడు (Tamil Nadu) పోలీసులు అప్రమత్తమయ్యారు.తమిళనాడు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఓ ఈమెయిల్‌లో ఈ బెదిరింపులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Read Also: AP Crime: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువతి ఆత్మహత్య

చెన్నై (Chennai) లోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అమెరికా కాన్సులేట్‌లో, ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో బాంబు పేలుతుందని దుండగులు హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే చెన్నై పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో రంగంలోకి దిగారు.

అమెరికా కాన్సులేట్ భవనం, నటుడు ప్రభు (Actor Prabhu) నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి క్షుణ్ణంగా గాలించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు.

కేవలం ఆకతాయిల చర్యగా భావిస్తున్నామని

ఇదే క్రమంలో అమెరికా కాన్సులేట్‌ (American Consulate) లో పనిచేసే మరికొందరు అధికారులతో పాటు, నటుడు ఎస్.వి. శేఖర్, మైలాపూర్‌లోని సుబ్రమణ్యస్వామి నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.అయితే, అన్ని చోట్లా తనిఖీలు పూర్తి చేసి, ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు.

ఇది కేవలం ఆకతాయిల చర్యగా భావిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ వరుస బెదిరింపులతో కొద్దిసేపు నగరంలో తీవ్ర ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

actor Prabhu Breaking News Chennai bomb threat latest news Telugu News US consulate Chennai

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.