Karate Kalyani: శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే?

Read Time:  1 min
Karate Kalyani: శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే?
FONT SIZE
GET APP

హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాటే కల్యాణి (Karate Kalyani) అభిప్రాయపడ్డారు.

Read Also: Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యున‌రేష‌న్

“నేను శివాజీని సమర్థిస్తాను. భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం ఉంది. కట్టు, బొట్టు మన సంస్కృతి. భారతీయ మహిళ అంటే ప్రపంచం మొత్తం గౌరవంగా చూస్తుంది. శివాజీ చెప్పిన విధానంలో కొంత తేడా ఉండొచ్చు కానీ ఆయన భావన మాత్రం తప్పు కాదు” అని ఆమె వ్యాఖ్యానించారు. శివాజీ మాట్లాడిన ఒకే ఒక్క మాటను తీసుకుని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

చికిరి చికిరి అనే పాటలో కూడా ఇలాంటి పదాలు వాడారు. అప్పుడు వాటిని తీసేయాలని చిన్మయి ఎందుకు అడగలేదు? దానిపై ఆమె ఎందుకు ట్వీట్ చేయలేదు? అంటూ ప్రశ్నించారు. ఇక డ్రెస్సింగ్ విషయంలో కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. “డ్రెస్సింగ్ ఎవరి సెన్స్ వాళ్లదే కావచ్చు. కానీ అనసూయ తన అబ్బాయి ఒడుగు కార్యక్రమంలో పిచ్చి డ్రెస్ వేసుకుని ఎందుకు కూర్చోలేదు? పట్టు చీర ఎందుకు కట్టుకుంది? అంటే వాళ్లకు సంప్రదాయం తెలుసు, ఆచారం తెలుసు.

What did Karate Kalyani say about Shivaji's comments?
What did Karate Kalyani say about Shivaji’s comments?

యువతలో పెరుగుతున్న అలవాట్లపై ఆందోళన

అవసరమైనప్పుడు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు” అని వ్యాఖ్యానించారు.ఇండస్ట్రీలో ఎదిగినవారు రోల్ మోడల్‌గా ఉండాలని కరాటే కల్యాణి అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే అర్ధనగ్న ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. చీరలు కట్టుకుని కూడా అందంగా కనిపించవచ్చు. ఎవరి ఇష్టం వాళ్లదే అయినా, ఒక బాధ్యత ఉండాలి” అన్నారు.

ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ దుస్తులపై తాను చేసిన పోస్టును ప్రస్తావిస్తూ, సమాజంలో వస్తున్న మార్పులు, యువతలో పెరుగుతున్న అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కరాటే కల్యాణి (Karate Kalyani) చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సంప్రదాయం-వ్యక్తిగత స్వేచ్ఛ అంశంపై మరోసారి చర్చకు తెరలేపాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.