📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest news: Bigg boss: కొత్త హౌస్ మేట్స్ రచ్చ రచ్చ

Author Icon By Saritha
Updated: October 16, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో హడావిడి

బిగ్ బాస్ హౌస్‌లోకి కొత్త హౌస్‌మేట్స్ రాగానే వాతావరణం మారిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆరుగురు సభ్యులు — అలేఖ్య చిట్టి, పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, నటీమణి ఆయేషా జీనత్ — ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్తవారితో హౌస్‌లో (Bigg boss) రచ్చ మొదలైంది. ముఖ్యంగా దువ్వాడ మాధురి, కళ్యాణ్ మధ్య జరిగిన వాదన హౌస్‌లో హీట్ పెంచింది. ఇద్దరూ చిన్న విషయానికే ఘాటైన మాటల యుద్ధం సాగించారు.

 Read also: ఆరోగ్యశ్రీ సేవలకు అనారోగ్యం!

నామినేషన్లలో హౌస్‌మేట్స్ మధ్య ఘర్షణలు

తాజా ఎపిసోడ్‌లో నామినేషన్ టాస్క్ హౌస్‌లో (Bigg boss) రచ్చకు కారణమైంది. బజర్ మోగగానే బాల్ క్యాచ్ చేసిన హౌస్‌మేట్స్ తమకు నచ్చిన సభ్యుడికి ఇచ్చి, అతను ఒకరిని నామినేట్ చేయాల్సి వచ్చింది. రాము రాథోడ్–రీతూ చౌధరి మధ్య మాటల తూటాలు రగిలాయి. అలాగే మాధురి–భరణి మధ్య వాదన కూడా హౌస్‌లో హైలైట్ అయింది. రీతూ భరణిని “మాట నిలబెట్టుకోలేదు” అంటూ నామినేట్ చేయగా, భరణి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు సంజన రామును “మానవత్వం లేదు” అంటూ నామినేట్ చేయగా, భరణి (Barani) ఆ వ్యాఖ్యపై సీరియస్ అయ్యాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ నామినేషన్లు, వాదనలు, భావోద్వేగాలతో నిండిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bigg Boss 2025 Bigg Boss Telugu Breaking News in Telugu Latest News in Telugu nominations episode Telugu News Telugu reality show wild card entries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.